Home హైదరాబాద్ రాంచరణ్‌కు ఉపాసన విడాకులిచ్చేస్తోందట..?

రాంచరణ్‌కు ఉపాసన విడాకులిచ్చేస్తోందట..?

ram-charan-sania-affair-donహైదరాబాద్: మెగాస్టార్ తనయుడు యువహీరో రాంచరణ్ ఆయన సతీమణి ఉపాసనల వివాహ జీవితంలో అనుమానమనే పెనుభూతం వచ్చి చేరిందట. దీంతో వీరు విడాకులు తీసుకునేందుకూ సిద్ధపడుతున్నట్ల్టు సామాజి మాధ్యమాల్లో పుకార్లు షీకార్లు కొడుతున్నాయి. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వైఫ్ ఆఫ్ పాక్ క్రికెటర్ సోయబ్‌అక్తర్‌తో రాంచరణ్ ఇటీవల చనువుగా ఉంటున్నాడనీ, తరచుగా సానియాను కలుసుకుంటున్నట్టు పుకార్లొస్తున్నాయి. సానియా వల్లే రాంచరణ్ ఉపాసన పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి. అలాగే, ఈ మధ్యే సానియా, సోయబ్‌ల మధ్య గొడవలు వచ్చాయనీ, అందుకే సానియా రాంచరణ్‌కు దగ్గరవుతోందని కూడా నెటిజన్లు వార్తలు సృష్టిస్తున్నారు. దీంతో రాంచరణ్‌ను ఉపాసన నిలదీసినట్లు, వారి మధ్య గొడవలు ముదిరి ఇరువురి కుటుంబాలకు తలనొప్పిగా మారిందని టాక్స్. రాంచరణ్ బుద్ధిహీనమైన పనిచేసినందుకు తాను చింతిస్తున్నానని, అతన్ని క్షమించేదిలేదని ఉపాసన చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. ఉపాసనను పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె మాత్రం చరణ్ పట్ల కోపంగానే ఉందని సినిమా కుటుంబాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.

ఇది నిజమా..?
సోషల్ మీడియాలో మంచీచెడూ రెండూ వస్తూనే ఉంటాయి. పుకార్లూ నిజాలయ్యే వేదిక కూడా అదే. అటు మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా, ఇటు యువహీరోగా తెలుగువారి గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు అభిమాన నటుడు రాంచరణ్. ఆయనో సెలెబ్రిటీ. ఎందరితోనో పరిచయాలుంటూయి. అనేక కార్యక్రమాలకు అతిథిగా హాజరవుతుంటారు. అక్కడ అతనితోపాటు సమానమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. అయినంత మాత్రాన వారితో అక్రమ సంబంధాన్ని అంటకట్టడం మంచిది కాదు. సానియా మీర్జా పేరున్న క్రీడాకారిణి. తెలుగు యువతేకాదు, ప్రపంచవాప్తంగా క్రీడాభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న టెన్నిస్ ప్లేయర్. అంతకంటే ఎక్కువ… ఆమె ఓ ఇల్లాలు. అలాంటిది మరో సెలబ్రిటీతో ఫంక్షన్లలో కలిసినంతమాత్రాన వారితో ఏదో జరుగుతుందని అనుమానం పెట్టుకోవడం తప్పు. ఇలా చేయడం వల్ల వారి వారి కాపురాల్లో నిప్పులు పోసినట్లవుతుంది. ఇది మన తెలుగువారి సంప్రదాయం కాదు. వస్తున్న పుకార్లు నిజమా కాదా దేవుడెరుగు.. కానీ, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్లు రావడం సర్వసాధారణం. వీటిని పట్టించుకుంటే తమ వివాహ జీవితాల్లో ఇబ్బందులెదుక్కోవలసి ఉంటుంది. ఒకవేళ రాంచరణ్, ఉపాసనలు విడాకులు తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తల్లో నిజముంటే.. వారి పెద్దలు వారిని కౌన్సిలింగ్ నిర్వహించాలి. లేదంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలి. దీని ద్వారా వారిలో పొరపొచ్చాలు రూపుమాపవచ్చు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన పిల్లల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదని టాక్ ఉంది. రాంచరణ్, ఉపాసనల విడాకులు అనే వార్త నిజం కాకూడదని ఆసిద్దాం.