Thursday, April 25, 2024

రెండు పాటలు బ్యాలెన్స్

- Advertisement -
- Advertisement -

Ramcharan NTR act in two songs

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ కొంత మేరకు బ్యాలెన్స్‌గా ఉంది. అయితే ఆ మిగిలి ఉన్న బ్యాలెన్స్ పోర్షన్ ఏమిటి అన్న దానిపై సరైన క్లారిటీ లేదు. కానీ దీనిపై ఈ చిత్ర నిర్మాత డివివి దానయ్య క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ చిత్రంలో ఇంకా కేవలం రెండు పాటలు తాలూకా షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని… అవి పూర్తయితే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. కాబట్టి షూటింగ్ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. అలాగే ఈ భారీ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరు నుంచే ప్రారంభిస్తున్నట్లుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News