Home Default కొత్త వ్యాపారం మొదలెట్టనున్న రాందేవ్ బాబా

కొత్త వ్యాపారం మొదలెట్టనున్న రాందేవ్ బాబా

Baba-Ramdev

పతంజలీ ఫుడ్‌, మెడిసిన్స్‌, కాస్మోటిక్స్‌లలో ఆయుర్వేదిక్ ప్రాడెక్ట్స్ తో ఇప్పటికే మార్కెట్ లో సంచలనాలు సృష్టిస్తున్న ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ వ్యాపారాలతో పాపులర్ అయిన రాందేవ్ త్వరలో వస్త్ర రంగంలోకి అడుగు పెట్టనున్నాట్లు సమాచారం. ‘స్వదేశీ’ లైనప్‌లో పురుషులు, మహిళలు, పిల్లల కోసం రాందేవ్‌ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ బట్టల వ్యాపారాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రారంభించనుందని ఆ కంపెనీ అధికారిక ప్రతినిధి ఎస్‌కె టిజారావాలా చెప్పారు.

ప్రారంభమైన తొలి ఏడాదే ఈ వస్త్రాల విక్రయ టార్గెట్‌ రూ.5000 కోట్లగా పతంజలి నిర్థారించుకుందని తెలిపారు. ఈ టార్గెట్‌ చేధించడానికి ఇప్పటికే వస్త్రాల తయారిని కూడా చేపడుతున్నారని పేర్కొన్నారు. ఊలు, కాటన్, నైట్ వేర్, మెషీన్ మేడ్, డెనిమ్ వంటి బట్టలను మార్కెట్‌లోకి తీసుకొస్తామని టీజారావాల చెప్పారు. స్వదేశీ ఏజెండాలో తీసుకొస్తున్న ఈ బట్టల వ్యాపారానికి ‘పరిదాన్‌’ అనే పేరును పెట్టాలని కూడా చూస్తున్నారట. 2018 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 250 ఎక్స్‌క్లూజివ్‌ రిటైల్‌ అవుట్‌లెట్లలో ఈ అప్పీరెల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.