Friday, March 29, 2024

ఇవాళ సాయంత్రం రానా నిశ్చితార్థం

- Advertisement -
- Advertisement -

Rana-engagement

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ హీరో దగ్గుబాటి రానా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మే 12వ తేదీన అందరికీ షాక్ ఇస్తూ.. తాను ప్రేమించిన అమ్మాయి గురించి సోషల్ మీడియా వేదికగా రానా ప్రకటించాడు. తన ప్రియురాలు ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. తన ప్రపోజల్‌కి ఆమె అంగీకరించినట్టు తెలిపాడు. దీంతో రానా, మిహీకాల ప్రేమ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. అయితే రానా ఇప్పుడు నిశ్చితార్థానికి రెడీ అయ్యాడు. రానా, మిహీకా బజాజ్ ల నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం సాయంత్రం 4గంటలకు రామానాయుడు స్టూడియోలో జరగనుంది. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న వీరు కుటుంబ పెద్దల అంగీకారంతో వివాహానికి సిద్ధమవుతున్నారు.

Rana Daggubati and Miheeka engagement today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News