Tuesday, April 23, 2024

ఆ పాత్ర కోసం 30 కిలోల బరువు తగ్గాడు

- Advertisement -
- Advertisement -

Rana Daggubati

 

రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న ‘అరణ్య’ చిత్రం అతిపెద్ద అడ్వెంచర్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మూడు భాషల్లో విడుదలవుతుండగా… మూడింటిలోనూ రానా హీరోగా నటిస్తున్నారు. తెలుగు వర్షన్ ‘అరణ్య’, తమిళ వర్షన్ ‘కాడన్’లో రానాతో పాటు విష్ణు విశాల్, హిందీ వర్షన్ ‘హాథీ మేరీ సాథీ’లో పుల్కిత్ సామ్రాట్ నటిస్తున్నారు. మరో రెండు ఆసక్తికర పాత్రల్ని శ్రియా పిల్గావోంకర్, జోయా హుస్సేన్ చేస్తున్నారు. కాగా ఈ యాక్షన్ మూవీలో ఇదివరకెన్నడూ కనిపించని కొత్త అవతారంలో రానా దగ్గుబాటి దర్శనమిస్తున్నాడంటూ ఇటు సినిమా వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో చర్చ నడుస్తోంది. రానా ఫస్ట్ లుక్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచే ఆయన అభిమానులు దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఇక సోషల్ మీడియాలో స్పందనకు అంతే లేదు. 35 ఏళ్ల రానా ఈ సినిమాలో బాణదేవ్ అనే అడవి మనిషి పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన చాలా కఠినమైన ఆహార నియమాల్ని పాటించడమే కాకుండా, కఠిన శిక్షణతో 30 కిలోల బరువు తగ్గారు. సినిమా అంతా ఆయన బాగా పెరిగిన గడ్డం, గ్రే హెయిర్, పైకి ఉండే భుజంతో కనిపిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ పాత్ర కోసం రానాతో పలు రకాల లుక్స్ ప్రయత్నించారు దర్శకనిర్మాతలు. వాటిలో దేన్ని ఫైనల్ చేశారో మొదటిరోజు షూటింగ్‌లో పాల్గొనేదాకా ఆయనకు కూడా వారు చెప్పలేదు. ఇక ఈ చిత్రం తనకు అద్భుతమైన అనుభవాన్నిచ్చిందని రానా చెప్పారు.

Rana Daggubati is hero of movie Aranya
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News