- Advertisement -
దగ్గుబాటి రానా హీరోగా చేస్తున్న క్రేజీ మూవీ ‘ఘాజీ’. 1971లో ఇండియా, పాకిస్తాన్ల మధ్య జరిగిన జలాంతర్గామి యుద్ధం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. బాలీవుడ్లో ఈ చిత్రాన్ని స్టార్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్లో ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలకానుంది. ఇకపోతే హిందీలో ఈ చిత్రానికి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. అయితే తెలుగులో చిరంజీవి, తమిళ్లో సూర్య ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందివ్వనుండడం విశేషం. దీంతో రానా సినిమాకు మంచి ప్రమోషన్ లభించనుంది. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. పివిపి సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకుడు. ఇందులో తాప్సీ హీరోయిన్గా నటించింది. భారీ స్థాయిలో రిలీజ్‌కానుంది ఈ చిత్రం.
- Advertisement -