Home తాజా వార్తలు రానా … సాయిపల్లవి సినిమా ప్రారంభం

రానా … సాయిపల్లవి సినిమా ప్రారంభం

Ranaహైదరాబాద్‌: రానా, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటిస్తున్న కొత్త  సినిమా శనివారం ప్రారంభమైంది. ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘విరాటపర్వం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.  ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేశ్‌ క్లాప్‌ కొట్టారు. గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఈ సినిమా స్క్రిప్టును ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు దర్శకుడు వేణు ఉడుగులకు అందించారు. అయితే ఈ కార్యక్రమానికి రానా, సాయి పల్లవి హాజరు కాలేదు. ‘విరాటపర్వం’ సినిమాను సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌ఎల్వీ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవి డీగ్లామర్‌ పాత్రలో కనిపించనున్నారని సినిమా యూనిట్ వెల్లడించింది. 1992 నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వాస్తవ ఘటనల  ఆధారంగా పొలిటికల్‌ ప్రేమకథగా ఈ సినిమాను తీస్తున్నారు. ప్రేమలో విఫలమై, నక్సలైట్‌గా మారిన యువతిగా సాయిపల్లవి, రాజకీయ నేతగా రానా నటిస్తున్నట్టు సినిమా యూనిట్ వెల్లడించింది.

Rana … Saipallavi Movie Beginning