Wednesday, April 24, 2024

ఫ్యామిలీ, కమర్షియల్ సినిమా

- Advertisement -
- Advertisement -

Rana who released Varudu kaavalenu trailer

 

నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్ తెరకెక్కించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఈ నెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రానా దగ్గుబాటి ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం రానా దగ్గుబాటి మాట్లాడుతూ “నాగశౌర్యని చూస్తే ‘రాముడు మంచి బాలుడు’ అన్న సామెత గుర్తొస్తుంది. ట్రైలర్ బావుంది. ఈ సినిమాతో నాగశౌర్య ఈజ్ బ్యాక్ అని చెప్పగలను”అని అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ “ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలా ఈ సినిమా ఉంటుంది.

అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. తెరపై ఆర్టిస్ట్‌లంతా ఫ్రెష్‌గా కనిపించడానికి కారణం డైలాగ్‌లు. గణేష్ రావూరి చక్కని సంభాషణలు రాశారు. విశాల్ చంద్రశేఖర్ చక్కని బాణీలు ఇచ్చారు. సౌజన్య అక్క నన్ను, సినిమాను ఎంతో ప్రేమించి ఈ సినిమా చేసింది. రీతు చాలా అద్భుతంగా నటించింది”అని తెలిపారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ “ఇది ఫ్యామిలీ, కమర్షియల్ సినిమా. సెకెండాఫ్‌లో ఒక సస్పెన్స్ ఉంది. అది యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకురాలు లక్ష్మీ సౌజన్య, సప్తగిరి, గణేష్ రావూరి, రాంబాబు గోశాల, విశాల్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News