Home తాజా వార్తలు విజయానికి రెండు వికెట్ల దూరంలో భారత్…

విజయానికి రెండు వికెట్ల దూరంలో భారత్…

 

రాంచీ: భారత్ తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఫాలోఆన్ ఆడుతున్న సఫారీ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. భారత బౌలర్లు మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా ఆటగాళ్లను ఉక్కిరిబక్కిరి చేశారు. దీంతో దక్షిణాఫ్రికా టాపార్డర్ తక్కువ పరుగులకే కుప్పకూలింది. దీంతో మిగతా ఆటగాళ్లు ఒత్తిడికి గురై వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. సఫారి టాప్ ఆటగాళ్లు ఒక్కరు కూడా క్రీజులో నిలవకపోవడంతో పాటు చేతిలో ఇంకా రెండు వికెట్లే ఉండడంతో దక్షిణాఫ్రికా ఓటమి దాదాపుగా ఖరారైనట్లే. ప్రస్తుతం క్రీజులో బ్రూయిన్(25), నాట్జ్(4)లు ఉన్నారు. భారత బౌలర్లలో షమీ మూడు, ఉమేష్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. భారత్ ఇప్పటికీ ఇన్నింగ్స్‌ 203 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Ranchi Test Day 3: SA 132/8 in 2nd Innings against India