Home జిల్లాలు సరిహద్దుల్లో కరువైన నిఘా

సరిహద్దుల్లో కరువైన నిఘా

rr– యథేచ్ఛగా పొరుగు రాష్ట్రాలకు
ఎరువుల తరలింపు
పెద్దేముల్ : సరిహద్దు ప్రాంతాలలో నిఘా లేక పోవడంతో పొరుగు రాష్ట్రాలకు యధేచ్ఛగా ఎరువులను తరలించి దండుకుంటున్నారు. బ్లాక్‌లో ఎరువులకు ధరలకు రెక్కలు రావడంతో సరిహద్దు రాష్ట్రమైన పొరుగు గ్రామాలకు ఎరువులను తరలించి పెద్దఎత్తున నిల్వలు పెడుతున్నారు. రైతులకు అందించాల్సిన ఎరువులలో యూరియా, డిఎపి, పోటాష్ తదితర రసాయనిక ఎరువులను తెలంగాణ ప్రభుత్వం మండలలలోని అగ్రికల్చర్, వ్యవసాయ ప్రాథమిక సహకార కేంద్రల ద్వారా విక్రయించేందుకు ఏర్పాటు చేసింది. మండల పరిధిలో రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో తట్టేపల్లిలో ఉంది. ఇక్కడ రైతులకు రసాయనిక ఎరువులను పెద్దఎత్తున నిల్వలు ఉంచారు. రైతులకు విక్రయిస్తూనే ఇక్కడి నుంచి పెద్దఎత్తున పొరుగున ఉన్న సరిహద్దు గ్రామమై కుంచారం గ్రామానికి ప్రతి రోజు రెండు మూడు ఆటోల ద్వారా యూరియను తరలిస్తున్నారు. వారం రోజులుగా ఈ తంతు సాగుతున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో అత్యధికంగా మక్కలు, వరి, పత్తి సాగు చేయడంతో వాటికి అత్యాధికంగా రైతులు యూరియాను వాడుతుంటారు. దీనిని ఆసరా చేసుకున్న అక్కడి వ్యాపారులు పెద్దఎత్తున నిల్వలు చేసుకున్నారు.కొందరు ఆటోల యాజమానులు దీనిని ఆసరాగా చేసుకుని పొరుగున ఉన్న కర్నాటకలోని కుంచారం గ్రామానికి యూరియను తరలిస్తున్నారు.ఇప్పటికై అధికారులు స్పందించి ఆక్రమ యూరియా రవాణను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.