Tuesday, March 19, 2024

భద్రం బిడ్డా..!

- Advertisement -
- Advertisement -

భక్తులను హెచ్చరిస్తున్నా….
ఎవరూ చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు
ప్రజలను కాపాడుకుందాం అనుకున్నా, కానీ ప్రజలే చేతులారా చేసుకుంటున్నారు
గంగాదేవి జలాలతో అభిషేకం, బోనం చేస్తే అమ్మవారు కరుణిస్తారు
రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
మనతెలంగాణ/హైదరాబాద్: భక్తులను ముందుగానే హెచ్చరిస్తున్నా, ఎవరూ చేసిన కర్మ వారు అనుభవించక తప్పదని అమ్మవారు స్వర్ణలత భవిష్యవాణిలో వినిపించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే రోజులు ప్రమాదకరంగా ఉంటాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అమ్మవారు స్వర్ణలత భవిష్యవాణిలో భాగంగా పేర్కొన్నారు. ప్రజలను కాపాడుకుందాం అనుకున్నా కానీ, ప్రజలే చేతులారా చేసుకుంటున్నారని, తనకు సంతోషం లేదని స్వర్ణలత పేర్కొన్నారు. గంగాదేవి జలాలతో అభిషేకం, బోనం చేస్తే అమ్మవారు కరుణించి ప్రజల కోరికలు తీరుస్తుందని అమ్మవారు తెలిపారు.
భక్తి భావనతో ఐదు వారాలు శాఖ పోసి, యజ్ఞాలు చేయాలి
అయితే కట్టడి చేయడానికి తాను ఉన్నానని, భక్తి భావనతో ఐదు వారాలు శాఖ పోసి, యజ్ఞాలు చేయాలని ఆమె ఆజ్ఞాపించారు. మహమ్మారిని తప్పకుండా తొలగిస్తానని స్వర్ణలత భవిష్యవాణిలో తెలిపారు. ప్రతి గడప నుంచి శాఖ, పప్పుబెల్లాలు తీసుకురావాలని ఆమె ఆదేశించారు. కామంతో కాకుండా భక్తి భావనతో చేసినట్టేతే తప్పకకుండా కాపాడతానన్నారు. ఈ ఏడాది ఉత్సవాలు తనకు సంతోషంగా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను తాను కాపాడతానని, కరోనాపై పోరాడతానని, రాబోయే రోజులు ప్రజలు కష్టాలు మరింతగా ఉంటాయని, మరిన్ని గడ్డురోజులను ఎదుర్కొవాల్సి వస్తుందని తీవ్రస్వరంతో ఆమె పేర్కొన్నారు.
భవిష్యవాణిపై ప్రజల ఆసక్తి
అయితే ప్రతి సంవత్సరం బోనాలను ఘనంగా నిర్వహించేవారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఉత్సవాలు కళ తప్పాయి. నగర వీధుల్లో ఎక్కడా అమ్మవారి ఊరేగింపులు, ఘటాలు లేకుండా నిర్మానుషంగా దర్శనమిచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండడంతో ఈ ఏడాది బోనాలు భక్తుల సందడి లేకుండా బోసిపోయాయి. ఇళ్లలోనే భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు. భవిష్యవాణిలో స్వర్ణలత కొన్ని కీలక విషయాలు చెప్పడంతో నగర ప్రజలు ఆసక్తి చూపారు.

Rangam Bhavishyavani in Ujjaini Mahankali bonalu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News