Thursday, April 25, 2024

ప్రతి ఒక్కరూ తల్లితండ్రులతో చూడాల్సిన సినిమా

- Advertisement -
- Advertisement -

హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌ంట్స్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఇళయరాజా సంగీతం సారధ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రంగమార్తాండ. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం లిరికల్స్ సాంగ్స్ ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటోంది, మరాఠీ సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామా ‘నట్ సామ్రాట్’ కి అఫీషియల్ తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఉగాది సందర్భంగా మార్చి 22న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకులు కృష్ణవంశీ మాట్లాడుతూ.. ‘సినిమాను చూసిన అందరూ పాజిటీవ్‌గా మాట్లాడుతున్నారు.

విడుదల తరువాత ప్రేక్షకులకు కూడా సినిమా బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాకు ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ నటన ఇళయరాజా సంగీతం, సీతారామశాస్త్రి సాహిత్యం ఇలా సినిమాకు అన్ని కుదిరాయి. ఈ సినిమాను చూసిన ఒక చిన్నారి ‘నేను మా అమ్మా నాన్నలను బాగా చూసుకుంటాను‘ అని చెప్పడం విశేషం. ఇలా సినిమా చూసిన అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు తమ తల్లి తండ్రులతో ఈ సినిమాను చూడాలి’ అని అన్నారు. ఈ సమావేశంలో సింగర్, నటుడు రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News