* కలెక్టర్ వెంకటరామిరెడ్డి
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజక్ట్ ని ర్మాణంలో భాగంగా చంద్లాపూర్ వద్ద నిర్మిస్తున్న రంగనాయకసాగర్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి సూచించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి మా ట్లాడుతూ సిద్దిపేట పట్టణంలోని మినీ ట్యాంకు బండ్, శిల్పారామాలను అత్యంత ప్రమాణాలతో కూడిన పర్యాటక ప్రాం తాలుగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు చేపట్టాలని సూచించా రు. ఇందుకు సంబంధించి పక్షం రోజుల్లో ప్లాన్‌ను సిద్ధం చేయాలని ఆదేశించి జలాశయాల వద్ద టూరి జం స్పాట్‌లుగా తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి రంగనాయకసాగర్‌పై ప్రత్యేక దృష్టి వహించి వీ కెండ్ స్పాట్‌గా తీర్చిదిద్దడమే కాకుండా అక్కడ వాటర్ స్పోర్ట్, గ్యాలరీ, చిన్నారుల ఆటస్థలాలు నిర్మించాలని నిర్ణయించారు. జిల్లాలో జలాశయాలను ఎక్కువ నిర్మిస్తున్నందున ఈ విషయా న్ని అధికారులు పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జెసి పద్మాకర్, డిఆ ర్వో చంధ్రశేఖర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వసంతకుమారి, ఇరిగేషన్ ఈఈ ఆనంద్, అర్బన్ ప్లానింగ్ కన్సల్టెంట్ శ్రీనివాస్‌తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
కాళ్లకుంట కాలనీలో కలెక్టర్ పర్యటన
సిద్దిపేట మునిసిపాల్టీ 27వ వార్డు పరిధిలోని కాళ్లకుంట కాలనీలో శనివారం జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి ఆకస్మికంగా ప ర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్ర జలకు చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుని కాలనీ వాసులతో మాట్లాడారు. కాలనీలో ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిశీలించి అనుమతులు లేకుండా ఇండ్ల నిర్మాణాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట కమిషనర్ శ్రీనివాసరెడ్డి, అర్బన్ తహసీల్దారు పరమేశ్వర్, అధికారులున్నారు.