Home తాజా వార్తలు సద్గురుతో ‘సింబా’ స్టెప్పులు…! (వీడియో)

సద్గురుతో ‘సింబా’ స్టెప్పులు…! (వీడియో)

Ranveer Singh ‏Dance with Sadhguru Jaggi Vasudev video going Viral

ముంబయి: బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్ పోస్టు చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో సద్గురు జగ్గీ వాసుదేవ్ తో కలిసి రణ్‌వీర్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. హ్యాపీ డ్యాన్స్ అంటూ ఆయన వేసిన స్టెప్పులు ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను హ్యాపీ డ్యాన్స్ విత్ సద్గురు అనే క్యాప్సన్ పెట్టి తన ట్విట్టర్ ఖాతాలో రణ్‌వీర్ షేర్ చేశాడు. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వేలల్లో వ్యూస్, లైక్స్ తో ఈ వీడియో దూసుకుపోతుంది. ఇక తన ప్రియురాలు దీపికా పదుకొణేతో కలిసి రణ్‌వీర్ నటించిన ‘పద్మావత్’ చిత్రం ఇటీవల భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ ‘సింబా’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం తెలుగులో వచ్చిన ‘టెంపర్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతోంది. దీంతో పాటు పాటు రణ్‌వీర్ ‘గల్లీ బాయ్’ అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నాడు. అలాగే త్వరలోనే దీపికా, రణ్‌వీర్ జంట పెళ్లిపీటలు ఎక్కనుందని తెలుస్తోంది.