Home జాతీయ వార్తలు బాలికపై అఘాయిత్యం … హత్య

బాలికపై అఘాయిత్యం … హత్య

RAPEముజఫర్‌నగర్ : 8 ఏళ్ల బాలిపై అత్యాచారం చేసి, ఆ తరువాత బండరాయితో మోది చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కిద్వాయినగర్ ప్రాంతంలో ఈనెల 15న ఆరుబయట ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలికను దుండగుడు కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలిక తలపై బండరాయితో మోదాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది. పోలీసులు కేసు విచారిస్తున్నారు.