Friday, March 29, 2024

మానవ ‘మృగాళ్లు’

- Advertisement -
- Advertisement -

Rape of a six-year-old girl and murderd

చాక్లెట్ ఇస్తానని నమ్మించి ఆరేళ్ల బాలికపై హత్యాచారం

గొంతు నులిమి హత్య హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం నిందితుడు పక్కింటి వ్యక్తే
అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాలని కాలనీవాసుల డిమాండ్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా గొంతునులిమి హత్య చేసిన సంఘటన నగరంలోని సైబరాబాద్ సింగరేణి కాలనీలో శుక్రవారం నాడు చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడు యాదాద్రి జిలా అడ్డగూడురులో తలదాచుకున్నట్లు గుర్తించిన నగర పోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే…నల్గొండ జిల్లా చందంపేట్‌కు చెందిన బాలిక కుటుంబ సభ్యులు బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఉంటున్నారు. వీరికి కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా యాదాద్రిభువనగిరి జిల్లా, అడ్డగూడురుకు చెందిన రాజు నాయక్(30), భార్యతో కలిసి బాధితురాలి ఇంటి పక్కనే ఆరునెలలుగా నివాముంటున్నాడు. మద్యానికి బానిసైన రాజు నిత్యం భార్యను వేధిస్తుండడంతో ఆమె అతనిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రాజు నిత్యం మద్యం సేవించడంతో పాటు చిల్లర దొంగతనాలు చేస్తూ జీవనంసాగిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఇంటి పక్కన ఉన్న బాలిక గురువారం గురువారం సాయంత్రం ఆడుకుంటుండగా చాక్లెట్ ఇస్తానని నమ్మించి తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేసి గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం బాలిక మృతదేహాన్ని పరుపులో చుట్టి బయట వేసేందుకు యత్నించాడు. ఇంటి బయట చుట్టుపక్కల వారు ఉండటంతో ఇంటికి తాళం వేసి సొంత గ్రామమైన అడ్డగూడురుకు పారిపోయాడు. ఈ క్రమంలోనే బాలిక కనిపించకుండా పోవడంతో గురువారం రాత్రి 9 గంటల వరకు తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో రాజుపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు రాత్రి 12 గంటలకు వచ్చి రాజు ఉంటున్న ఇంటి తాళం పగులగొట్టి చూడడంతో బాలిక మృతదేహం లభ్యమైంది. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం నాడు పోస్టుమార్టం చేసిన వైద్యులు బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు.

ఎన్‌కౌంటర్ చేయాలని ఆందోళన

ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనను నిరసిస్తూ నగరంలోని చంపాపేట్ వద్ద సాగర్ రోడ్డుపై కాలనీవాసులంతా నిరసనకు దిగారు. అభం శుభం తెలియని చిన్నారిని పొట్టనబెట్టుకున్న నిందితుడు రాజును ఎన్‌కౌంటర్ చేయాలని లేనిపక్షంలో తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో పోలీసులకు, కాలనీవాసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదే క్రమంలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలుకావడంతో గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో చంపాపేట్ రహదారిపై రాకపోకలు ఏడు గంటలప ఆటు నిలిచిపోయాయి. ఆందోళన మధ్యే బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ ధర్నా వద్దకు చేరుకుని తక్షణ సాయం కింద రూ.50,000, డబుల్ బెడ్ రూము ఇప్పిస్తామని, కుటుంబ సభ్యులు అర్హులు ఉంటే అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. వీలైనంత త్వరగా నిందితుడికి చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. సింగరేణి కాలనీలో బెల్ట్ షాప్స్, గుడుంబా లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితురాలి సోదరులకు మోడల్ స్కూల్‌లో ఉచితంగా చదివిస్తామని తెలిపారు.

నిందితుడి వేటలో ప్రత్యేక పోలీసు బృందాలు

బాలికపై అత్యాచారం చేసి నిందితుడు అక్కడి నుంచి పరార్ కావడంతో పోలీసులు ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. అన్ని చెక్‌పోస్టులు, పెట్రోలింగ్, బ్లూకోల్ట్ విస్కృతంగా గాలింపు చేపట్టారు. ఈస్ట్‌జోన్ జాయింట్ సిపి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో పది బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు నిందితుడు తన సొంత గ్రామానికి రావడంతో అడ్డగూడురు ఎస్సై ఉదయ్‌కిరణ్ అరెస్టు చేసి హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని జాయింట్ సిపి రమేష్ రెడ్డి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను కలిసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News