Home ఆదిలాబాద్ ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

Rapeఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన సముద్రాల శ్రీనివాస్(15) అదే కాలనీకి చెందిన ఓ చిన్నారి(5)పై అత్యాచారం చేశాడు. రోడ్డుపై ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.