Home తాజా వార్తలు మైనర్ బాలికపై అత్యాచారం

మైనర్ బాలికపై అత్యాచారం

Rape

 

ఐడిఏబొల్లారం : అభం శుభం తెలియని మైనర్ బాలికపై 22 సంవత్సరాల యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేసుకు సంబంధించిన వివరాలను బొల్లారం మండలంలో శుక్రవారం పటాన్‌చెరువు డిఎస్పి రాజేశ్వర్‌రావు, సిఐ లకా్ష్మరెడ్డి తెలిపారు. జార్ఖండ్ కు చెందిన భార్యాభర్తలు ఇరువురు గత 8 సంవత్సరాల క్రితం బొల్లారం గ్రామానికి బ్రతుకు దెరువు నిమిత్తం వలస వచ్చారు. గ్రామంలోని లక్ష్మినగర్‌లో నివాసం ఉంటున్నారు.

కాగా వారికి 6 సంవత్సరాల కుమార్తె ఉంది. వారు నివాసం ఉంటున్న ఇంటి యజమాని కుమారుడు దుర్గాప్రసాద్ (22) గత మంగళవారం రోజున 6 సంవత్సరాల బాలికను మేడమీదికి తీసుకొని వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించటమే కాకుండా సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించినట్టు ఆ పాప తన తల్లికి తెలిపింది. దీంతో పాప తల్లి తన భర్తతో కలిపి శుక్రవారం బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Rape on a minor girl