ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య
మనతెలంగాణ/హైదరాబాద్ : ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేసిన ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ఓ గ్రామంలో బుధవారం నాడు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం పొలం పనులు చేస్తున్న ఓ తండ్రి తన ఐదేళ్ల కూమార్తెను ఇంటికి తీసుకెళ్లమని తన దగ్గర గుమస్తాగా పనిచేసే బాబు(40)తో చెప్పాడు. చిన్నారిని తీసుకెళ్లిన బాబు సాయంత్రం గడుస్తున్న ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఊరంతా వెతికారు. ఈక్రమంలో సాయంత్రం సమయంలో ఊరి పక్క న ఉన్న వాగులో వెళ్లి చూడగా చిన్నారి మృతదే హం ఒంటి మీద బట్టలు లేకుండా కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొద్ది సేపటికి నిందితుడు కూడా కొంత దూరంలో బట్టలు లేకుండా కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడిని అరెస్ట్ చేసి పోలీ సు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఐదేళ్ల చిన్నారిని అత్యం త దారుణంగా అత్యాచారం, ఆపై హత్య చేసిన బాబుని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.