Home తాజా వార్తలు తొమ్మిదేళ్ల చిన్నారి పై అఘాయిత్యం

తొమ్మిదేళ్ల చిన్నారి పై అఘాయిత్యం

Rape Case
మన తెలంగాణ/రాజేంద్రనగర్ : డ్యాన్స్ నేర్పిస్తానంటూ వరుసకు మామ అయ్యే వ్యక్తి బిల్డింగ్‌పైకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తొమ్మిదేళ్ల చిన్నారి బంధువులు పోలీసులను ఆశ్రయించారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. చిన్నారి బంధువులు, స్థానికులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డిలో క్యాజువల్ ఎలక్ట్రిషియన్‌గా విధులు నిర్వహిస్తున్న ఖమ్మం ప్రాంతానికి చెందిన సందీప్ రాజేంద్రనగర్‌లోని మాణిక్యమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఉన్న సందీప్‌కు వరుసకు బావ అయ్యే వ్యక్తి కుమార్తె (9) ఒంటరిగా కనిపించింది. దాంతో మాయమాటలు చెప్పి డ్యాన్స్ నేర్పిస్తానంటూ బిల్డింగ్ పైకి ఆ బాలికను తీసువెళ్లాడు. అనంతరం చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఏమి తెలియని వాడిలా ఉన్నాడు.

సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన బాలిక తండ్రి తన కుమార్తె ఏడుస్తు కనిపించడంతో ఏమిటని ఆరా తీశాడు. దాంతో సందీప్ తనను బిల్డింగ్‌పైకి తీసుకువెళ్లి ఏదో చేశాడని తండ్రికి చెప్పింది. వెంటనే చిన్నారి బాలికను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి వైద్యులు పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ ఇవ్వడంతో పాటు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. దాంతో పోలీసులను ఆశ్రయించిన బాలిక తండ్రి జరిగిన ఘోరాన్ని పోలీసుల వివరించి, ఫిర్యాదు చేశాడు. అనంతరం బాలికలను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసుల స్థానికుల సాయంతో సందీప్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన సందీప్‌కు ఇటీవలే వివాహం అయినట్లు స్థానికులు తెలిపారు. కొత్తగా పెళ్లి చేసుకున్నా కామంతో కళ్లు మూసుకుపోయిన సందీప్ ముక్కుపచ్చలారని చిన్నారిపై వికృతచేష్టలకు దిగడం పట్ల స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి గట్టిగా శిక్ష వేయాలని పోలీసులను కోరుతున్నారు.

Rape On Nine Years Old Girl In Hyderabad