Home జాతీయ వార్తలు కొడుకు అత్యాచారం చేస్తుంటే… వీడియో తీసిన తల్లి…

కొడుకు అత్యాచారం చేస్తుంటే… వీడియో తీసిన తల్లి…

Rapeచత్తీస్‌గఢ్‌ : ఓ యువతిపై కొడుకు అత్యాచారం చేస్తుంటే, అతడి తల్లి దాన్ని వీడియో తీసింది. ఈ క్రమంలో సదరు యువతి నుంచి రూ.4 లక్షలకు పైగా లాగారు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌ లో జరిగింది. ఓ యువకుడు ప్రేమ పేరుతో డబ్బున్న ఓ యువతిని ముగ్గులోకి దింపాడు. ఈ క్రమంలో సదరు యువకుడు తన ప్రియురాలైన ఆ యువతిని తన ఇంటికి ఆహ్వానించాడు. ప్రియుడి ఇంటికి వచ్చిన ఆ యువతికి అతడి తల్లి ప్రేమతో ఆహ్వానం పలికింది. అనంతరం ఆ యువతికి అతడి తల్లి స్నాక్స్ ఇచ్చింది. ఈ స్నాక్స్ తిన్న సదరు యువతి మగతలోకి జారుకుంది. దీంతో ఆ యువకుడు తన ప్రియురాలైన ఆ యువతిపై అత్యాచారం చేశాడు. దీన్ని అతడి తల్లి వీడియో తీసింది. మగత నుంచి తేరుకున్న సదరు యువతి తనపై  అత్యాచారం జరిగినట్టు తెలుసుకుని షాక్ గురై తన ప్రియుడిని నిలదీసింది. ఈ విషయం ఎవరికైనా చెబుతే వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని, డబ్బు ఇవ్వాలని వారు బాధిత యువతిని బెదిరింపులకు గురి చేశారు. దీంతో భయపడిన సదరు యువతి తన తండ్రి వద్ద నుంచి రూ.4లక్షలు తీసుకుని ప్రియుడి కుటుంబానికి ఇచ్చింది. అత్యాచారం విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడి అక్కాబావలు కూడా సదరు యువతిని డబ్బు కోసం వేధించారు. అంతేకాదు తన వద్ద తీసుకున్న రూ.4లక్షలు తిరిగి ఇవ్వాలని బాధితురాలి తండ్రి తన కూతురును నిలదీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు సదరు బాధిత యువతి ప్రియుడు, అతడి తల్లిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Rape On Woman In Chhattisgarh