Thursday, April 18, 2024

ఆశ్రమంలో మహిళపై సామూహిక అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ లక్నో న్యూస్: జానకి మందిర్ ఆశ్రమంలో 15 రోజుల క్రితం 55 ఏళ్ల మహిళకు మత్తు మందు ఇచ్చిన అనంతరం ఆమెపై నలుగురు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని గోమటి నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అక్టోబర్ 4న గీతా, మరో మహిళ కలిసి జానకి మందిర్ ఆశ్రమానికి వచ్చారు. హనుమాన్ దాస్ మహంత్‌ను ఇద్దరు కలిశారు. గీతా సోదరుడికి అనారోగ్యం పాలు కావడంతో ఆమె వెంటనే వారణాసి వెళ్లిపోయింది. మహిళ అదే ఆశ్రమంలో ఉండిపోయింది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు సదరు మహిళకు మత్తు మందు ఇచ్చారు. హనుమాన్ దాస్ మహంత్ మరో ముగ్గురు దుర్వాసా, చోటే మౌనీ, బారే మౌన్లతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని ఆమెను బెదిరించారు. ఆశ్రమం నుంచి సదరు మహిళ తప్పించుకొని తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ అధికారి దినేష్ చంద్ర మిశ్రా తెలిపాడు.

 

ఇవి కూడా చదవండి….

చందానగర్ లో భార్యను కత్తెరతో పొడిచి…. భర్త ఆత్మహత్య

సాదుకున్నందుకు చంపేసింది…

భార్య చేతి వేళ్లను నరికి…

ప్రేమోన్మాదానికి కూతురు, తండ్రి బలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News