హైదరాబాద్ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి డిగ్రీ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. రహమత్ నగర్ కార్మికనగర్ లో ఉండే యువతి(23) బికాం చదువుతోంది. అదేప్రాంతానికి చెందిన బిటెక్ విద్యార్థి రాజు పెళ్లి చేసుకుంటానని చెప్పి సదరు యువతిని ఇంటికి పిలిచాడు. అతడిని నమ్మి వచ్చిన ఆమెపై రాజు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.