Home తాజా వార్తలు తల్లి సహకారంతో యువతిపై అత్యాచారం… నిందితుడు అరెస్టు

తల్లి సహకారంతో యువతిపై అత్యాచారం… నిందితుడు అరెస్టు

Rape

 

హైదరాబాద్: యువతిపై అత్యాచారం చేసిన యువకుడు, సహకారం చేసిన తల్లిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కాప్రా ప్రాంతానికి చెందిన యువతి ఇంటర్ కళాశాలలో రిసెప్షనిస్ట్‌గా జాబ్ చేస్తుంది. నాచారం ప్రాంతానికి చెందిన అబ్దుల్ మజీద్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు. ఆమెను బలవంతపెట్టి పలుమార్లు అత్యాచారం చేశాడు. కొన్ని సార్లు అత్యాచారం చేసేటప్పుడు వాళ్ల అమ్మ మద్దతు ఇచ్చేదని అమ్మాయి వాపోయింది. రేప్ చేసినప్పుడు నిందితుడు కొన్ని సార్లు వీడియోలు తీశాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలు కోరడంతో మజీద్ నిరాకరించాడు. దీంతో బాధితురాలు మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Rape on Young Women with Mother at Mallapur in Medchal