Home జాతీయ వార్తలు అత్యాచార బాధితురాలి 26 వారాల గర్భస్రావానికి అనుమతి

అత్యాచార బాధితురాలి 26 వారాల గర్భస్రావానికి అనుమతి

Rape victim allowed 26 weeks abortion

కొచ్చి: అత్యాచార బాధితురాలైన మైనర్ బాలిక 26 వారాల గర్భస్రావానికి కేరళ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. గర్భాన్ని కొనసాగించడమో లేక విఛ్ఛితి చేసుకోవడమో బాధితురాలి ఇష్టానికి కోర్టు విడిచిపెట్టింది. గర్భనిరోధక వైద్య చట్టం ప్రకారం అత్యాచారం వల్ల గర్భం సంక్రమించిందని బాధితురాలు భావించి ఆవేదన వ్యక్తం చేస్తే అది ఆ బాధితురాలి మానసిక ఆరోగ్యానికి తీరని హాని కలిగిస్తుందని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. చట్టంలో ఉండే వెసులుబాటు ప్రకారం, బాధితురాలి వయస్సు, గర్భం దాల్చడానికి దారి తీసిన పరిస్థితులు ఇవన్నీ పరిగణించి, న్యాయపరమైన ప్రయోజనాలతో ఈ అవకాశం కల్పిస్తున్నామని కోర్టు వివరించింది. ఈ ప్రకియలో పిండం బతకడానికి అవకాశం ఉంటే ఆస్పత్రి వైద్యవర్గాలు రక్షించడానికి ప్రయత్నించాలని కోర్టు సూచించింది.