Home అంతర్జాతీయ వార్తలు కరోనా యాంటీబాడీల సామర్ధ్యతను గుర్తించే కొత్త ర్యాపిడ్ పరీక్ష

కరోనా యాంటీబాడీల సామర్ధ్యతను గుర్తించే కొత్త ర్యాపిడ్ పరీక్ష

Rapid test identifies antibody against covid variants

 

డ్యూక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధన

కాలిఫోర్నియా : కరోనా సోకడం లేదా టీకా తీసుకోవడం ద్వారా శరీరంలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలు, ఒమిక్రాన్ సహా వివిధ వేరియంట్లను ఎంత సామర్ధ్యంగా అడ్డుకోగలవన్నది తెలుసుకునేందుకు సరికొత్త ర్యాపిడ్ పరీక్ష అందుబాటు లోకి వచ్చింది. ఈ పరీక్ష ద్వారా వివిధ వేరియంట్లకు వ్యతిరేకంగా ఒక వ్యక్తికి ఎంతమేర రక్షణ ఉందన్నది తెలుసుకునే అవకాశం ఉంది. డ్యూక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సాగించిన ఈ పరిశోధన వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ పత్రిక అందించింది. వ్యక్తులకు ఏ వేరియంట్ సోకింది? వారిలో ఏ తరహా యాంటీబాడీలు , ఏ స్థాయిలో ఉన్నాయి ? వివిధ వేరియంట్లకు వ్యతిరేకంగా అవి ఎంత సమర్ధంగా పనిచేస్తాయి? అన్న విషయాలను తెలుసుకునేందుకు ప్రస్తుతం ఎలాంటి ర్యాపిడ్ పరీక్షలూ అందుబాటులో లేవు. దీంతో శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధన సాగించి కోవేరియంట్ న్ అనే పరీక్షను రూపొందించారు. ఇది ఎలా పనిచేస్తుందో పరిశోధన కర్త కామెరాన్ వోల్ఫ్ వివరించారు.

నిర్దిష్ట బయోమార్కర్లను మాత్రమే గుర్తించేలా పాలిమర్ బ్రష్ కోటింగ్‌తో ఒక ఫలకను రూపొందించామని, దీనికి ఒకవైపు మనిషిలో ఉండే ఏసీఈ2 ప్రొటీన్లను ఉంచామని, కరోనా స్పైక్ ప్రొటీన్లు లక్షం చేసుకునేది వీటినే అని చెప్పారు. అదే ఫలకపై కొన్ని చోట్ల వివిధ వేరియంట్లకు చెందిన స్పైక్ ప్రొటీన్లను ముద్రించామని , పరీక్ష సమయంలో ఏసీఈ 2 ప్రొటీన్లు స్పైక్ ప్రొటీన్లతో అతుక్కు పోయాయని తెలిపారు. తదుపరి పరీక్షలో వివిధ రకాల యాంటీబాడీలను కూడా ఫలకపై ఉంచామన్నారు. అప్పుడు కొన్ని స్పైక్ ప్రొటీన్లు ఏసీఈ 2 రిసిప్టర్లను గ్రహించలేదని, మరికొన్ని కొంతవరకే వాటితో అతుక్కున్నాయని ఆ సమయంలో కొన్ని బల్పులు పూర్తిగా వెలగలేదన్నారు. బల్బులు కాంతిని ప్రసరించే తీరును బట్టి ఒక వ్యక్తి లోని యాంటీబాడీలు వివిధ వేరియంట్లకు వ్యతిరేకంగా ఎంత సమర్ధంగా పనిచేయగలవన్నది తెలుసుకోవచ్చని కామెరాన్ వోల్ఫ్ వివరించారు.

Rapid test identifies antibody against covid-19 variants