Home సినిమా పింక్‌కు అరుదైన గౌరవం

పింక్‌కు అరుదైన గౌరవం

PINK

ముంబయి : మహిళలపై లైంగిక వేధింపులు, ఆధునిక మహిళల పట్ల సమాజం వివక్షను ప్రశ్నిస్తూ రూపొందించిన పింక్ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్‌బచ్చన్ తెలిపారు. సెప్టెంబరు 16న ఈ చిత్రం విడుదలైంది. మంచి కలెక్షన్లతో విజయపథంలో దూసుకెళుతోంది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించారు. అమితాబ్ చిత్ర కథాయిక తరపున వాదించే న్యాయవాది పాత్రలో నటించారు. తాప్సీ , ఆండ్రియా తరియాంగ్, కీర్తి కుల్హర్‌లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుద్దరాయ్ చౌధురి దర్శకత్వం వహించారు. శూజిత్‌సర్కార్,రష్మిశర్మలు నిర్మాతలుగా వ్యవహరించారు.