Home తాజా వార్తలు రాశీఖన్నా బర్త్ డే.. ‘వెంకీమామ’ సర్ ప్రైజ్

రాశీఖన్నా బర్త్ డే.. ‘వెంకీమామ’ సర్ ప్రైజ్

 

హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. ఈ చిత్రంలో వెంకీ సరసన ‘అర్ఎక్స్ 100’ ఫేం పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. చైతుకు జోడీగా రాశీఖన్నా నటిస్తోంది. కాగా, ఈ రోజు రాశీ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో అభిమానులను బాగా ఆకట్టకుంటోంది. ఇక, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకీ, చైతులు మామ అల్లులుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. యువ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Rashi Khanna b’day Special teaser from Venky Mama