Thursday, April 18, 2024

హార్రర్ మూవీ సీక్వెల్‌లో

- Advertisement -
- Advertisement -

Rashikhanna

 

కోలీవుడ్‌లో హార్రర్ సినిమాలకు ఆదరణ ఎక్కువ. అందుకే హిట్ అయిన హార్రర్ చిత్రాలకు సీక్వెల్స్ తీస్తుంటారు ఫిల్మ్‌మేకర్స్. ప్రస్తుతం దర్శకుడు సుందర్.సి ఇదే పనిలో ఉన్నారు. తన పాపులర్ ‘అరన్మనై’ ప్రాంఛైజీలో మూడవ భాగాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారాయన. మొదటి భాగంలో హన్సిక, ఆండ్రియా, రాయ్ లక్ష్మీలను, రెండవ భాగంలో హన్సిక, త్రిష, పూనమ్ భజ్వాలను తీసుకున్న ఆయన మూడవ పార్ట్ కోసం రాశీఖన్నా, ఆండ్రియాలను తీసుకోనున్నారు. ఇలా పాపులర్ హార్రర్ ప్రాంఛైజీలో భాగమవడం పట్ల రాశీఖన్నా చాలా హ్యాపీగా ఫీలవుతోంది. హార్రర్ జోనర్‌లో సినిమా చేయడం తనకు ఇష్టమని, ఆ కోరిక ‘అరన్మనై 3’తో నెరవేరుతుండటం సంతోషంగా ఉందని రాశీ పేర్కొంది. ఇకపోతే ఇందులో ఆర్య ప్రధాన పాత్రదారుడిగా నటించనున్నాడు. వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశం ఉంది.

 

Rashikhanna In the Horror Movie Sequel
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News