Home వార్తలు రష్మీ హైలైట్‌గా తను…వచ్చేనంట

రష్మీ హైలైట్‌గా తను…వచ్చేనంట

reshmiతేజ కాకుమాను, రష్మీ గౌతమ్, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా శ్రీ అచ్యుత ఆర్ట్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్న చిత్రం ‘తను… వచ్చేనంట’. వెంకట్ కాచర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రంతో సరికొత్త జోనర్‌ను పరిచయం చేస్తున్నాం. కథ, కథనం… అన్నీ కొత్తగా ఉంటాయి. రష్మీ గౌతమ్ నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చంటి, ఫిష్ వెంకట్, శివన్నారాయణల కామెడీ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్‌లో ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు”అని అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణంః రాజ్‌కుమార్, సంగీతంః రవిచంద్ర, ఎడిటర్‌ః నందమూరి హరి, ఆర్ట్‌ః సిస్తల శర్మ.