Home సినిమా ‘అంతకు మించి’న రష్మి

‘అంతకు మించి’న రష్మి

Rashmi

జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై యూ అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పిస్తున్న చిత్రం ‘అంతకు మించి’. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం విడుదల తేదీని ‘ఆర్‌ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ “అన్ని జోనర్‌ల కంటే హార్రర్, థ్రిల్లర్ సినిమాలు తీయడం చాలా కష్టం. వీటిలో సౌండ్ ఎఫెక్ట్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. ‘అంతకుమించి’లో సౌండ్ ఎఫెక్ట్ ప్రత్యేకంగా ఉంటాయి. ట్రైలర్ చాలా బాగుంది. రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. ఈ సినిమా హీరో, నిర్మాత జై నాకు మంచి మిత్రుడు. మొదటిసారిగా అతను చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను”అని అన్నారు. దర్శకుడు జానీ మాట్లాడుతూ “సినిమాలో రష్మీ చాలా బాగా నటించారు. తనే ఈ సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు. హీరో జై కొత్తవాడైనప్పటికీ ఎక్కడ ఆ ఫీల్ కలగదు. అనుభవం ఉన్న నటుడిలా చేశాడు”అని పేర్కొన్నారు. హీరో జై మాట్లాడుతూ “సినిమాలో చివరి రెండు సీన్లు చూసి ప్రేక్షకులు ఖచ్చితంగా భయపడతారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో టైటిల్ పడుతుంది. అంతకు మించి అని అప్పుడు అర్థమవుతుంది. రష్మీ అద్భుతంగా నటించారు”అని తెలిపారు. హీరోయిన్ రష్మీ మాట్లాడుతూ “హీరో జై మంచి నటుడు. ఈ చిత్రం కోసం రాత్రి పూట ఎక్కువగా షూటింగ్స్ చేశాము. ఇందులో నేను డూప్ లేకుండా స్టంట్స్ కూడా చేశాను. ఈ హార్రర్ థ్రిల్లర్ అందరికీ నచ్చుతుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో భానుప్రకాష్, కన్న తిరుమనాదం, పద్మనాభరెడ్డి, టిఎన్‌ఆర్, హర్ష తదితరులు పాల్గొన్నారు.