Home సినిమా రష్మికకు బంపర్ ఆఫర్

రష్మికకు బంపర్ ఆఫర్

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు ఓకే చెప్పిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రం షూటింగ్ ఎప్పటి నుంచి మొదలు పెడతారో ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. ఈనెల 14 నుంచి షూటింగ్ అన్నారు కానీ ఇంకా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో బన్నీకి జోడీగా హీరోయిన్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది.

విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నను హీరోయిన్‌గా తీసుకున్నారట. ఇది కనుక నిజమైతే ఆమెకు బంపర్ ఆఫర్ తగిలినట్టే. మెగా కాంపౌండ్‌లోకి ఒక్కసారి అడుగు పెడితే ఆ హీరోల నుంచి మెల్లిగా మరిన్ని అవకాశాలు వస్తాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తోంది రష్మిక. దీంతో పాటు నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది ఈ బ్యూటీ.

Rashmika act in Trivikram and Bunny movie!