Home తాజా వార్తలు రష్మికకు లక్కీ ఛాన్స్

రష్మికకు లక్కీ ఛాన్స్

Rashmika Mandanna

 

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే క్యాస్టింగ్ మొత్తం పూర్తయింది. ఒక్క హీరోయిన్ తప్ప. పైగా మొదటి షెడ్యూలు కూడా మొదలై వారం రోజులు అవుతోంది. అయినా సినిమాలో హీరోయిన్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. ఆ మధ్య ఇద్దరు కొత్త హీరోయిన్లను చూశారని.. వాళ్లల్లో ఎవరో ఒకర్ని హీరోయిన్‌గా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిలో నిజం లేదట. తాజా సమాచారం ప్రకారం అఖిల్ సరసన యంగ్ బ్యూటీ రష్మికా మందన్నను హీరోయిన్‌గా ఫైనల్ చేయబోతున్నట్లు తెలిసింది. కొంతమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించినా చివరికి రష్మికా మందన్న వైపే ఫిల్మ్‌మేకర్స్ మొగ్గు చూపారట. ఇక అఖిల్ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ సినిమా కూడా భాస్కర్ ‘బొమ్మరిల్లు’ సినిమా లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీతో తెరకెక్కనుందని తెలిసింది.

Rashmika Mandanna to team up with Akhil Akkineni next