Home తాజా వార్తలు అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా: రష్మిక మందన్న

అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా: రష్మిక మందన్న

Rashmika mandanna

 

హైదరాబాద్‌ : రష్మిక మందన్న తనకు కాబోయే భర్త ఇలా ఉండాలని తన మనసులోని భావాలను వెల్లడించింది. తాజాగా రష్మిక మందన్న నటిస్తున్న చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. విజయ్‌ దేవరకొండ కథానాయకుడు. భరత్‌ కమ్మ దర్శకుడు. ఈ సినిమా జులై 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా ప్రచారంలో భాగంగా రష్మిక ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ… ‘అతడు తన భావాల్ని, ఇష్టాల్ని వ్యక్తపరిచే వ్యక్తైనా, కాకపోయినా ఫర్వాలేదు. కానీ నిజాయతీగా ఉండాలి. అతడి ప్రవర్తన నాకు నచ్చాలి. అన్నింటికన్నా మించి అతడిది మంచి మనస్సై ఉండాలి. అతడితో చాలా సమయం గడపాలని నాకు అనిపించాలి. నా దృష్టిలో రొమాంటిక్‌గా ఉండేందుకు వయసుతో పనిలేదు’ అని పేర్కొన్నారు.

రష్మిక తన సహ నటుడు రక్షిత్‌ శెట్టిని 2017లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. కొన్ని కారణాల వల్ల రష్మిక, రక్షిత్‌ విడిపోయి, 2018 సెప్టెంబరులో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు.

Rashmika said I will Marry a good Hearted Man