Saturday, April 20, 2024

శ్రీశార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు

- Advertisement -
- Advertisement -

Rasi phalalu 2020

 

మేషం —–ఆదాయం-5, వ్యయం-5, రాజపూజ్యం-3, అవమానం-1

వీరికి సంవత్సరమంతా గురుడు, సెప్టెంబర్ 23 వరకు రాహువు యోగదాయకులు. శని మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ప్రారంభం నుంచి అన్ని విధాలా అనుకూల సమయమే. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. భవిష్యత్తు మరింత బంగారుమయంగా కనిపిస్తుంది. ఇతరులు సైతం మిమ్మల్ని మెచ్చుకునే సమయం. అంద రిలోనూ ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. చిరకాల ప్రత్యర్థులు కూడా మీకు శిరస్సు వంచుతారు. దైవకార్యాలలో పాల్గొంటారు. ఆశ్చర్యకరమైనరీతిలో విద్యార్థులు ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఊహించని రీతిలో ఉద్యోగావకాశాలు దక్కే అవకాశం. ఉద్యోగస్తులు గతం నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు అధిగమిస్తారు. వ్యాపారులు మరిన్ని వ్యాపారాలకు శ్రీకారం చుట్టి లాభాల దిశగా పయనిస్తారు. వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభసాటిగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు తమ నైపుణ్యతను ప్రదర్శిస్తారు. అత్యుత్తమ పురస్కారాలు సైతం అందుకునే వీలుంది. అదృష్టసంఖ్య-9.

వృషభం ——– ఆదాయం-14, వ్యయం-11, రాజపూజ్యం-6, అవమానం -1

ఇక వీరికి కుటుంబస్థానంలో సెప్టెంబర్ 23 వరకు, తదుపరి జన్మస్థానంలో రాహుసంచారం. అలాగే, మార్చి 29 నుంచి జూన్29 వరకు గురుడు భాగ్యస్థానంలో అతిచారం సంచారకాలం శుభదాయకంగా ఉంటుంది. తదుపరి నవంబర్ 20 వరకు అష్టమస్థాన సంచారం అనుకూలం కాదు. అనంతరం తిరిగి భాగ్యస్థానంలో సంచారం విశేష యోగకాలం. ఇక శని కొంతవరకూ యోగాన్నిస్తాడు. మొత్తం మీద వీరికి శుభాశుభమిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఏదోవిధంగా సర్దుబాటు చేసుకుం టారు. రావలసిన పైకం చేతికందుతుంది. చేపట్టిన కార్యక్రమాలు కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. వీరు ఆరోగ్యంపై మాత్రం శ్రద్ధ వహించాలి. గురుడు, రాహువులకు పరిహారాలు చేయించాలి. సుబ్రహ్మణ్య స్తోత్రాలు పఠించడం మంచిది. జ్యేష్ఠం, శ్రావణం, ఆశ్వయుజం, కార్తీకం, మాఘ మాసాలు అత్యంత అనుకూలిస్తాయి. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-6.

మిథునం ఆదాయం-2, వ్యయం-11, రాజపూజ్యం-2, అవమానం-4

ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే, ఈ ఏడాది మార్చి 29 నుంచి జూన్ 29 వరకు, తదుపరి నవంబర్ 20 నుంచి అష్టమ గురుడు దోషకారి. జూన్29 నుంచి నవంబర్ 20 మధ్య కాలంలో గురుడు సప్తమస్థానంలో సంచారం అనుకూలం. ఇక రాహువు ఏడాదంతా దోషకారి. మొత్తం మీద వీరు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటిస్తూ మసలుకోవడం మంచిది. ముఖ్య కార్య క్రమాలు వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలి. నిర్వహణ వంటివి చేస్తారు. అలాగే, నిరుద్యోగులకు ఈ కాలంలో శుభఫలితాలు ఉంటాయి. విద్యార్థులు కొంత శ్రమిస్తే మరింత అనుకూల ఫలితాలు సాధిస్తారు. టెక్నికల్, శాస్త్రసామాజిక రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. క్రీడాకారులు మధ్యలో విజయాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండో పంట కొంత అనుకూలిస్తుంది. వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఆదిత్య హృదయం పఠించాలి. చైత్రం, శ్రావణం, కార్తీకం, పుష్య మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి. అదృష్టసంఖ్య-5.

కర్కాటకం ——— ఆదాయం -11, వ్యయం-8, రాజపూజ్యం-5, అవమానం-4

వీరికి గురుడు మార్చి 29 నుంచి జూన్ 29 వరకు శుభుడు, తదుపరి నవంబరు 20 వరకు పాపి, తదుపరి శుభదాయకుడు. ఇక శని సప్తమస్థానంలో సంచారం అనుకూలం కాదు. సెప్టెబంబర్ 23 నుంచి రాహువు లాడఘ స్థానంలో శుభుడు. మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు, వ్యయప్రయాసలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలను అతికష్టం మీద పూర్తి చేస్తారు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు. ఆస్తుల విషయంలో అయినవారితో విభేదాలు నెలకొంటాయి. ఇంటి నిర్మాణాలలో జాప్యం ఏర్పడుతుంది. రాజకీయవేత్తలకు ప్రజాదరణకు లోటులేకున్నా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటారు. కళాకారులకు అవకాశాలు క్రమేపీ పుంజుకుంటాయి. క్రీడాకారులు, న్యాయ వాదులు, వైద్యులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. వీరు శని, రాహువు, గురునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఆషాఢం, భాద్రపదం, మార్గశిరం, మాఘ మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి. అదృష్టసంఖ్య-2.

సింహం ఆదాయం-14, వ్యయం-2, రాజపూజ్యం-1, అవమానం-7

వీరికి గురుడు మార్చి 29 నుంచి జూన్ 29 వరకు, తిరిగి నవంబర్ 20 నుంచి షష్ఠమస్థానంలో సంచరించిన కాలంలో సామాన్యస్థితి. ఆరోగ్యపరంగానూ, వ్యవహారం పరంగానూ కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు. జూన్ 29 నుంచి నవంబరు వరకు గురుని పంచమస్థానంలో సంచారం శుభదాయకం. ఇక శని, రాహువుల సంచారం కూడా అనుకూలమే. మొత్తం మీద వీరికి శుభదాయకమైన కాలమనే చెప్పాలి.క్రీడాకారులు, న్యాయవాదులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభదాయకమే. ఉత్పత్తులు పెరిగి తగినంత లాభాలు అందుకుంటారు. రాజకీయవేత్తలు కొత్త పదవులు చేపడతారు. గురుడు షష్ఠమ స్థానంలో సంచారం సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అలాగే, ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం. వీరు గురునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఈశ్వరాభిషేకాలు ఉపయుక్తంగా ఉంటాయి. చైత్రం, వైశాఖం, శ్రావణం, ఆశ్వయుజం, పుష్య మాసాలు విశేషంగా కలిసివస్తాయి. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య 1.

కన్య ఆదాయం-2, వ్యయం-11, రాజపూజ్యం-4, అవమానం-7

వీరికి గురుడు అర్ధాష్టమ స్థానంలో సంచారం. అంటే జూన్ 29 నుంచి నవంబరు 20 వరకు కొద్దిపాటి ఇబ్బం దులు ఎదురైనా శుభకారకుడైనందున అధిగమిస్తారు. అలాగే, శని సంవత్సరమంతా శుభుడే. అలాగే, రాహు సంచారం కూడా అనుకూ లమని చెప్పాలి. మొత్తం మీద వీరికి అనుకూలసమయంగా భావించాలి. ముఖ్యం గా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణబాధలు తీరి గట్టెక్కుతారు. అలాగే, జ్ఞాతుల నుంచి ఊహించని రీతిలో ధనలాభాలు ఉండవచ్చు. గురుడు అర్థాష్టమ స్థానంలో సంచరించే కాలంలో అంటే జూన్ 29 నుంచి నవంబరు 20 మధ్య కాలంలో మాతృవర్గం వారితో ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి. అలాగే, మనోదైర్యం తగ్గి నిరుత్సాహం చెందుతారు. అయితే గురుడు శుభ గ్రహమైనందున ధనుస్సులో స్వక్షేత్ర స్థానంలో సంచరిస్తున్నందున ఎప్పటికప్పుడు అధిగమించి ఉపశమనం లభిస్తుంటుంది. ఇక ఆషాఢం, ఆశ్వయుజం, మార్గశిరం, పుష్యం, పాల్గుణ మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి మధ్యస్థంగా ఉంటాయి. అదృష్టసంఖ్య-5.

తుల ఆదాయం-14, వ్యయం-11, రాజపూజ్యం-7, అవమానం-7

విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు కొంత కష్టపడాలి. నిరుద్యోగులు ఎట్టకేలకు ఉపాధి అవకాశాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు మరింత ఆలస్యమవుతాయి, ఆశించిన లాభాలు కష్టమే. విస్తరణ కార్యక్రమాలలోనూ ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు మీదపడి సహనాన్ని పరీక్షిస్తాయి. అలాగే, ఊహించని మార్పులు తథ్యం. పైస్థాయి అధికారులతోనూ విభేదిస్తారు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు సామాన్యంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మంచిది. కళాకారులు ద్వితీయార్థంలో కొంత అనుకూలమైన ఫలితాలు పొందుతారు. రాజకీయవేత్తలు ఉన్న పదవులు కాపాడుకుంటూ సహనంతో మెలగడం ఉత్తమం. వ్యవసాయదారులకు రెండవ పంట కాస్త లాభిస్తుంది. క్రీడాకారులు, వైద్యులకు పరీక్షా సమయమని చెప్పాలి. వీరు గురు, శని, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, దుర్గాదేవి, హనుమానుడికి పూజలు చేస్తే ఉపశమనం లభిస్తుంది. చైత్రం, జ్యేష్ఠం, శ్రా వణం, మాఘ మాసాలు అనుకూలమైనవి కాగా, మిగతావి సామాన్యంగా ఉంటాయి. అదృష్టసంఖ్య -6

వృశ్చికం ఆదాయం -5, వ్యయం-5, రాజపూజ్యం-3, అవమానం-3

ఇక వీరికి సెప్టెంబర్ 23 వరకు అష్టమ రాహు దోషం ఇబ్బంది కలిగించినా గురు, శనులు అనుకూల ఫలితాలు ఇస్తారు. మొత్తం మీద వీరికి శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి. అష్టమ రాహు దోషం కారణంగా వీరికి తరచూ ఆరోగ్యసమస్యలు, వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. రుణబాధలు క్రమేపీ తగ్గుతాయి. ఏ కార్యక్రమమైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది. ప్రతి వ్యవహారంలోనూ యుక్తిగా మసలుకొని విజయం సాధిస్తారు. తరచూ తీర్థయాత్రలు సాగిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. జ్ఞాతుల నుంచి ఆస్తి లాభాలు కలుగుతాయి. క్రీడాకారులు, సాంకేతిక రంగాలకు చెందిన వారు గతేడాది కంటే మించి విజయాలు సాధిస్తారు. వీరు నవంబరు 20 తరువాత గురునికి పరి హారాలు చేయించుకుంటే ఉత్తమం. శివ, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. అదృష్టసంఖ్య-9.

ధనుస్సు ఆదాయం-8, వ్యయం-11, రాజపూజ్యం-6, అవమానం-3

ఇక వీరికి మార్చి 29 నుంచి జూన్ 29 వరకు ద్వితీయంలో గురుడు శుభుడు. అనంతరం జూన్ 30 నుంచి నవంబర్ 20 వరకు జన్మరాశి సంచారం. తదుపరి తిరిగి ద్వితీయంలో సంచారం. ద్వితీయరాశి సంచారంలో గురుడు శుభఫలితాలు ఇస్తాడు. జన్మరాశిలో సంచార సమయంలో మానసిక ఆందోళన, తరచూ శారీరక రుగ్మతలు వంటి బాధలు కలిగించవచ్చు. ఇక, శని సంవత్సరమంతా ద్వితీయ స్థా నంలో సంచారం, ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నందున కాస్త ఉప శమనం లభిస్తుంది. రాహు, కేతువులు సెప్టెంబర్ 23 వరకు సప్తమ, జన్మరాశుల్లో సంచారం. తదుపరి షష్ఠమ, వ్యయస్థానాలలో సంచారం. వీరి స్థితి కూడా అంతగా అనుకూలం కాదు. మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమ రాజకీయవేత్తలకు కొన్ని అవాంతరాలు ఎదు రైనా నెట్టుకొస్తారు. వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూ లిస్తా యి. వీరు శనీశ్వరునికి, రాహు, కేతువులకు పరిహారాలు చేయిం చుకుంటే మంచిది. అలాగే, గాయత్రీ ధ్యానం ఉపకరిస్తుంది. ఇక వైశాఖం, ఆషాఢం, మార్గశిరం, పుష్య మాసాల్లో విశేష లాభదాయకంగా ఉం టుంది. మిగతావి సామాన్యంగా కొనసాగుతాయి. అదృష్టసంఖ్య-3.

మకరం ఆదాయం-11, వ్యయం-5, రాజపూజ్యం-2, అవమానం-6

వీరికి ఏల్నాటి శని ప్రభావంతో పాటు గురుబలం లోపించడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ గ్రహాల మూర్తిమంతం ప్రభావం వల్ల దోషాలు కొంత తొలగుతూ ముందుకు సాగుతుంటారు. అలాగే, రాహు, కేతువుల సంచారం సెప్టెంబర్ 23 నుంచి అనుకూలం. మొత్తం మీద వీరికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు అవసరమైన శక్తిసామ ర్థ్యాలు సమకూరుతాయి. స్థిరాస్తి వివాదాలు నెలకొన్నప్పటికీ సర్దుబాటు వైఖరి కారణంగా తొలగే సూచనలు. ఇంటి నిర్మాణ యత్నాలు ద్వితీయార్థంలో అనుకూలిస్తాయి. వివాహయత్నాలు సాను కూలమై ద్వితీయార్థంలో శుభకార్యాలు జరుగు తాయి. వ్య్రవసాయదారులకు మొదటి పంట కొంత అనుకూ లిస్తుం ది. క్రీడాకారులు, న్యాయ వాదులు, వైద్యుల సేవలకు సరైన గుర్తింపు లభించక నిరాశ చెందుతారు. వీరు శని, గురు, రాహువులకు పరి హారాలు చేయించుకుంటూ ఉండాలి. అలాగే, శివాభిషేకాలు, విఘ్నే శ్వర స్తోత్రాల పఠనం మంచిది. ఇక, చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.
అదృష్టసంఖ్య-8.

కుంభం ఆదాయం-11, వ్యయం-5, రాజపూజ్యం-5, అవమానం-6

ఇక వీరికి ఏల్నాటి శని దోషం అధికంగా ఉంటుంది. అలాగే, వ్యయస్థానంలో అంటే మార్చి 29 నుంచి జూన్ 29 వరకు, తిరిగి నవంబర్ 20 నుంచి గురు సంచారం కూడా ప్రతిబంధకంగా ఉంటుంది. జూలై నుంచి నవంబర్ 20 మధ్యకాలంలో గురుబలం కాస్త ఊరటనిస్తుంది. అలాగే, సెప్టెంబర్ 23 నుంచి అర్ధాష్టమ రాహుదోషం కూడా తోడై ఇబ్బంది పెట్టొచ్చు. మొత్తంమీద వీరికి ఏడాది మధ్యకాలం మినహా మిగతా కాలమంతా చికాకులు తప్పవు. జూలై- నవంబర్ మధ్య కాలం వీరికి విశేషంగా కలసివస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. అలాగే, సంతానపరంగా మరింత సౌఖ్యం. కొందరికి సంతానప్రాప్తి కలిగే అవకాశాలు. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. మొదటి పంట సామాన్యం. క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యరంగాల వారికి కొంత ఉపశమ నం లభిస్తుంది. వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, హనుమాన్ పూజలు, ఆదిత్య హృదయం పఠనం మంచిది. ఇక, చైత్రం, భాద్రపదం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-8.

మీనం– ఆదాయం-8, వ్యయం-11, రాజపూజ్యం-1, అవమానం-2

ఇక, వీరికి శని, గురులు శుభులు. వీరి సంచారం శుభదాయకంగా ఉంటుంది. ఇక సెప్టెంబర్ 23 వరకు అర్ధాష్టమ రాహువు దోషం కొంత చికాకు పరుస్తుంది. మొత్తం మీద వీరికి అన్ని విధాలా అనుకూల కాలమని చెప్పాలి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఏ కార్యక్రమమైనా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కాంట్రాక్టర్లకు విశేషమైన కాలమని చెప్పాలి. ఇంట్లో శుభకార్యాలతో హడావిడి నెలకొంటుంది. మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. తరచూ శారీరక రుగ్మతలు బాధిస్తాయి. శత్రువులతో కొంత అప్రమత్తంగా మెలగండి. వీరు రాహుకేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, విష్ణుసహస్రనామ పారాయణ చాలా ఉపకరిస్తుంది. ఇక, వైశాఖం, ఆషాఢం, భాద్రపదం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అత్యంత అనుకూలమైనవి. మిగతా నెలలు మధ్యస్థంగా ఉంటాయి. అదృష్టసంఖ్య-3.

Rasi phalalu 2020
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News