Home వికారాబాద్ డీలర్ల పరేషాన్..

డీలర్ల పరేషాన్..

Ration Dealers Doing Strike From July

మన తెలంగాణ/నవాబుపేట: వచ్చే నెల 1 నుంచి రేషన్ సరఫరాపై నీలి నీడలు కమ్ముకొన్నుయి. ఇప్పటి వరకు ఒక్క రేషన్ డీలరు కూడా డీడీని చెల్లించలేదు. ప్రభుత్వం రేషన్ డీలర్ల మధ్య బుధవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు పోరాడుతామని. జూలై నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని డీలర్లు అంటున్నారు. వికారాబాద్ జిల్లాలో మొత్తం 588 రేషన్ దుకాణాలు ఉన్నాయి. అందులో నవాబుపేట మండలానికి సంబంధించి 33 రేషన్ దుకాణాలు ఉన్నాయి. దానిలో తెల్ల రేషన్ కార్డులు 10,932,అంత్యోదయ కార్డులు 1952 ఉన్నాయి. ప్రతి నెల ఆయా కార్డుల లబ్ధిదారులకు 2463 కింట్వాల బియ్యం సరఫరా అవుతుంది. సగటున మండలంలో 92 శాతం ఈ- పాస్ విధానంలో రేషన్ పంపిణీ చేస్తున్నారు. అయితే  తమఇచ్చే  కమిషన్ స్థానంలో గౌరవవేతనం చెల్లించాలని డీలర్లు ఆందోళన చేస్తున్నారు. డీలర్లు వచ్చే నెల పంపిణీ చేసే సరుకులకు డీడీలు చెల్లించకపోవడంతో పేదల్లో ఆందోళన మొదలైయింది. కానీ రేషన్ డీలర్లు మాత్రం తాడోపేడో లేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెల డీడీలు ఒక్కరు కూడా  చెల్లించలేదు. దీంతో వచ్చే నెల చౌక దుకాణాలు మూతబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.పేద మధ్య తరగతి ప్రజలకు రూపాయికే కిలో బియ్యం ఒక్క వరం. ఒక్కటో  తేదీ నుంచి 15లోగా బియ్యం పంపిణీ పూర్తి చేసి 16 నుంచి వచ్చే నెల కోటా కోసం డీలర్లు డీడీలు చెల్లిస్తారు. కానీ ఈ నెల 24 తేదీ వరకు డీడీలు కట్టాలేదు. ఈ- పాస్ విధానం వచ్చిన తర్వాత డీలర్లుకు కష్టాలు మొదలయ్యాయి. తూకం గింజ అటుఇటు కాకుండా ఇవ్వాల్సి వస్తోంది. కమిషన్ పెంచాలని కోరుతూ కొన్నేళ్లుగా డీలర్లు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ప్రభుత్వంతో చర్చలు విఫలం రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు జూకరెడ్డి
రేషన్ డీలర్లతో ఆదివారం జరిగిన ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విఫలపైనట్లు రేషన్ డీలర్ల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు జూకరెడ్డి అన్నారు. ఆయన ’మనతెలంగాణ’తో మాట్లాడుతూ మరోసారి ప్రభుత్వం చర్చలు జరిపేందుకు మూడ్రోజుల సమయం ఇవ్వలని కమిషనర్ కోరినట్లు వెల్లడించారు. సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు.

డీలర్ల సమస్యలు పరిష్కరించాలి నవాబుపేట మండల రేషన్ డీలర్ల అధ్యక్షుడు ప్రకాశం
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కింటాకు రూ. 200 ఇస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూ.20 మాత్రమే చెల్లిస్తున్నారు. అందులో హమాలీతో పాటు దుకాణం అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఆహార భద్రత చట్టం ప్రకారం 2015 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు రావాల్సిన బకాయిలను వెంటనే డీలర్లకు చెల్లించాలి. ఆర్టీసీ కార్మికులకు, హమాలీ కార్మికులకూ వేతనాలు పెంచిన ప్రభుత్వం డీలర్ల విషయంలో మొండిగా వ్యవహరిస్తుందన్నారు. పాత బకాయిలు చెల్లించడంతో పాటు గౌరవ వేతనంగా నెలకు రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.