Thursday, April 25, 2024

నేటి నుంచి 10కిలోల బియ్యం ఉచితం

- Advertisement -
- Advertisement -

Ration rice distribution upto november

 

నవంబర్ వరకు అందజేత, 2 కోట్ల 79లక్షల మందికి లబ్ధి
పేదల ఆకలి తీర్చేందుకే సిఎం కెసిఆర్ ఆరాటం : మంత్రి గంగుల

మన తెలంగాణ/కరీంనగర్: రాష్ట్రంలోని పేదల ఆకలి తీర్చేందుకు సిఎం కెసిఆర్ ఆరాటపడుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో ఆదివారం నుండి పేదలకు ఉచితంగా 10 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. శనివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మా ట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలు పస్తులుండకూడదనే ఉద్ధేశంతో సిఎం కెసిఆర్ గత మూడు నెలలుగా రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 12 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేశారన్నా రు. ఈ ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జూలై నుండి నవంబర్ వరకు కూడా కొనసాగించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారని స్పష్టం చేశారు.

దీంతో రాష్ట్రంలోని 2 కోట్ల 79 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఒక్కొక్కరికి 10 కిలోల బి య్యం జులై నుండి నవంబర్ వరకు ఇస్తామని స్పష్టం చేశారు. సిఎం ఉదారతకు నిదర్భనమే ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం అన్నారు. ప్రధాని మోదీ ప్రకటించిన 5 కిలోల బియ్యానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 5 కిలోల బియ్యం అందజేస్తుందని ప్రకటించారు. కేంద్రం కేవలం ఆహార భద్రత కారుదారులకే ఇస్తుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మా త్రం రేషన్ లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. కేంద్రం ఒక్కొక్క లబ్ధిదారుకు నవంబర్ వరకు 5 కిలోల బియ్యం ప్రకటించిందని, దానికి అదనంగా తెలంగాణ రా ష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోల బియ్యం న వంబర్ వరకు అందజేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుండి అమలు చేస్తామని అన్నారు. కరీంనగర్‌లో స్వయంగానే తానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఈ పంపిణీ జూలై నుండి నవంబర్ వరకు నిరంతరాయం గా కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్నప్పటికీ నిరుపేదలు పస్తులుండకూడదనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రానికి ప్రతి నెలా 50 కోట్ల అదనపు భారం పడుతుందని, 5 నెలలకు 250 కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రంలో 1 కోటి 79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నెలకు అవసరం పడుతుందని, కానీ ఇప్పుడు నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో అదనంగా 2 కోట్ల 89 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో మేయర్ వై.సునీల్‌రావు, కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ రుద్రరాజు, కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, కంసాల శ్రీనివాస్, చాడగొండ బుచ్చిరెడ్డి, గుగ్గిళ్ల జయశ్రీ, కోల ప్రశాంత్‌లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News