Home తాజా వార్తలు పిడిఎస్ బియ్యం అక్రమ దందా…

పిడిఎస్ బియ్యం అక్రమ దందా…

 

యాదాద్రిభువనగిరి: రేషన్ బియ్యం అక్రమ దందాలో జిల్లాలో కొత్త రూపాలు ఎదురు చూస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. వ్యాపారస్తులు రేషన్ బియ్యాన్నే ఒక వ్యాపారంగా కొత్త మార్గంలో దందాకు శ్రీకారం చుడుతున్నారు. రేషన్ డీలర్ల నుండి అబ్దిదారులకు రేషన్ బియ్యం సరఫరా కాగా ఎక్కువ శాతం మంది రేషన్ బియ్యం తిననివారే ఉండడంతో నేరుగా లభ్దిదారుల నుండే అక్రమ బియ్యం వ్యాపారం చేసే వారికి చేరుతున్నాయి.

దీనితో పాటు నేరుగా రేషన్ డీలర్‌కు రవాల్సిన రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై, గోదాంలో పనిచేసే వారితో పాటు కొంత మంది రేషన్ డీలర్లు మిల్లర్లు కుమ్మకై యాదాద్రిభువనగిరి జిల్లాలో గత సంవత్సర కాలంగా పలు మండలాల్లో అక్రమ రేషన్ బియ్యం లారీల కొద్ది సరఫరా జోరుగా సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరఫరా కొరకు ఈ పాస్ విధానం ద్వారా రేషన్ డీలర్లకు సరఫరా చేయడంతో తప్పని పరిస్థితిలో రేషన్ కార్డు లభ్దిదారులు రేషన్ బియ్యం తీసుకొని రాగా రేషన్ బియ్యం అక్రమ దారులకు ఒక్కో కిలో 6, 7 రూపాయలకు కొనుగోలు చేసి బియ్యాన్ని నూకలుగా మార్చి ఒక వాహనంలో రైస్ మిల్లులకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. అందుకు వారికి కిలో రేషన్ బియ్యంపై 15 నుండి 16 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది.

తాజాగా యాదాద్రిభువనగిరి జిల్లా రాజపేట మండలంలోని పుట్టగూడ గ్రామంలో 200 బస్తాలతో పాటు, ఆత్మకూరు మండలం పల్లెపాడు గ్రామంలో కూడా లారీ లోడ్ బియ్యాన్ని వ్యవసాయ బావుల వద్దా డంపుచేసినట్లు తెలియడంతో ఎస్‌ఓటి పోలీసులు దాడులు చేసి కేసు నమోదు చేసిన విషయం తెలిసినదే… అసలు జిల్లాలో గత నెల రోజులుగా లారీల కొద్ది రేషన్ బియ్యం అక్రమంగా దారులు మళ్ళుతుంటే సివిల్ సప్లై యంత్రాంగం మాత్రం స్పందించకుండా సంబందించిన రేషన్ డీలర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలివేయడంతో రేషన్ అక్రమ దందాలు జిల్లాలో ఊపందుకున్నాయి. రేషన్ డీలర్లతో పాటు సివిల్ సప్లై అధికారులు కూడా మిల్లర్లతో కుమ్మక్కై పక్కదారి పడుతున్న బియ్యానికి అడ్డు కట్ట వేయకుండా వదిలివేస్తున్నారు. అందుకు నిదర్శణమే వరుసగా దొరికిన పిడిఎఫ్ బియ్యమే సాక్షమని చెప్పుకోవచ్చు.

జిల్లాలో నిఘా ఏది?

రేషన్ బియ్యం డీలర్లకు తరలించే సమయంలో అమలుచేస్తున్నటువంటి జిపిఎస్ విధానం ఏమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేషన్ డీలర్ల చొరవతో కొంత మంది గ్రామాలల్లో చిల్లర వ్యాపారాలు కొనసాగిస్తుండగా అదే అలుసు పట్టుకున్న కొంత మంది అధికారులు రేషన్ డీలర్ల వద్దకు వెళ్ళకుండా దారి మళ్ళిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతి రేషన్ డీలర్‌కి సంబందించిన రేషన్ బియ్యం వివరాలన్ని ఆర్వో దగ్గర ఉంటుంది. దీనితో పాటు డ్రైవర్ దగ్గర ఒక పత్రంలో వివరాలు ఉంటాయి. ఆర్వో డ్రైవర్ దగ్గర ఉన్న పత్రాలు రెండు వివరాలు సమానంగా ఉంటాయి. ఇందులో ఏది పొరపాటు ఉన్నా గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ పాస్ విదానం ద్వారా ఇంత పకడ్బంది విదానం ఉన్నప్పటికీ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నా వెనుక కింది స్థాయి నుండి పై స్థాయి సహకారం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Ration Rice in illegal Transport