Home ఆంధ్రప్రదేశ్ వార్తలు పశ్చిమగోదావరి జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత

పశ్చిమగోదావరి జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత

Ration Rice Seized In West Godavari Districtఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని కొవ్వూరుగామన్ బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం విజిలెన్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. పశ్చిమ గోదావరి నుంచి తూర్పుగోదావరి జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 23 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో  లారీ, రెండు బొలెరో వాహనాలను అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనలో  నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.