Thursday, April 25, 2024

ఈ నెలాఖరు వరకు రేషన్ ఇస్తం

- Advertisement -
- Advertisement -

gangula kamalaker

 

ప్రజలు గాబరాపడొద్దు, కొన్ని జిల్లాల్లో సర్వర్ల మొరాయింపు నిజమే
ఎప్పటికప్పడు సమస్యలు పరిష్కరించి పంపిణీ చేస్తున్నాం, ఖాతాల్లో
రూ. 1500 నగదు జమపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు
– మంత్రి గంగుల కమలాకర్

ప్రజలు గాబరా పడొద్దు.. ఆగమాగం కావొద్దు
ప్రతి లబ్ధిదారునికి ఉచిత బియ్యం
ఒక్క రోజులోనే 34,687 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ మంత్రి గంగుల

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘ఉచిత బియ్యం కోసం ప్రజలు గాబరా పడొద్దు…. ఆగమాగం కావొద్దు’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ నెలాఖరు వరకు రేషన్ బియ్యం అందిస్తామని స్పష్టం చేశారు. చివరి కార్డు లబ్ధిదారుని వరకు బియ్యం అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. అందువల్ల లబ్దిదారులు ఎవరు బియ్యం కోసం ఆందోళన చెందవద్దని కోరారు. ‘మన తెలంగాణ ప్రతినిధి’తో మంత్రి గంగుల మాట్లాడుతూ, లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో అలమటించవద్దు అన్నదే సిఎం కెసిఆర్ లక్షమన్నారు. అందుకే వలస కూలీలతో పాటు తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం పింపిణీ చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారన్నారు.

ఈ ప్రక్రియ ప్రస్తుతం రాష్ట్రంలో నిరాటంకంగా కొనసాగుతోందని మంత్రి వివరించారు. రాష్ట్రం మొత్తంలో 87.55 లక్షల కార్డులు ఉండగా, 3.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉందన్నారు. అయితే రేషన్ ఇవ్వడంలో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ శనివారం ఒక్క రోజులోనే 34,687 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లబ్ధిదారులకు అందజేశామన్నారు. ఈ బియ్యాన్ని 8,74,156 మంది కుటుంబాలకు అందించామన్నారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,22,628 మెట్రిక్ టన్నుల బియ్యం లబ్ధిదారులకు అందించామన్నారు. దీంతో రాష్ట్రంలో 35.35 శాతం మందికి బియ్యం అందించినట్లు అయిందని మంత్రి తెలిపారు.

కొన్ని జిల్లాలో సాంకేతిక కారణాల వల్ల అక్కడక్కడ సర్వర్లు పనిచేయడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయని మంత్రి అంగీకరించారు. అయితే సంబంధిత అధికారులు అప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుని బియ్యం పంపిణీ కార్యక్రమం సాఫీగా జరిగేలా చూస్తున్నారన్నారు. అలాగే కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.1500లను అందిస్తోందన్నారు. ఈ డబ్బులను బ్యాంకులో జమచేయాల్సిన కారణంగా కొంత ఆలస్యమవుతోందన్నారు. ఈ డబ్బు కూడా ప్రతి కుటుంబానికి అందిస్తామన్నారు. ఇందులో ఎవరు…ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు.

 

Ration will be given until end of this month
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News