Home తాజా వార్తలు వైద్యం కోసం దాచుకున్న రూ.రెండు లక్షల ఎలుకల పాలు

వైద్యం కోసం దాచుకున్న రూ.రెండు లక్షల ఎలుకల పాలు

Rats destroyed 2 lakh currency notes in mahabubabad

 

మహబూబాబాద్: ఎండా.. వానా వెరువకుండా రోజంతా కష్టపడి కూరగాయలు అమ్ముకుని రూపాయి రూపాయి పోగు చేసుకున్న గిరిజనుడు వైద్యం కోసం దాచుకున్న రూ. రెండు లక్షలు ఎలుకల పాలు అయిన సంఘటన మహబూబాబాద్ జిల్లా పరిధిలోని వేమునూరు శివారు ఇందిరా నగల్ తండాలో చోటుచేసుకుంది. భూక్యా రెడ్యా అనే గిరిజనుడు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు సంపాదనలో కొంత మొత్తం ఇంట్లో దాచిపెట్టుకుంటూ వస్తున్నాడు. ఇటీవల ఆయన అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నాడు. వైద్యం కోసం దాచుకున్న సొమ్మును ఖర్చు చేద్దామని భావించాడు.

అలా దాచుకున్న సొమ్ము దాదాపు రూ.రెండు లక్షల వరకు పోగు చేసుకున్నాడు. విధి వక్రీకరించి ఇంట్లో బీరువాలో దాచుకున్న సొమ్మును ఎలుకలు దూరి వాటిని పటపట్ట కొరికివేశాయి. ఆ నోట్లన్ని రూ.ఐదు వందలే కావడం విశేషం. అలా ఎలుకలు కొట్టిన నోట్లను చూసి రెడ్యా బోరున విలపించాడు. ఎలుకలు కొట్టిన నోట్లను మానుకోటలోని ఎస్‌బీఐ బ్యాంకు వెళ్లగా అవి చెల్లుబాటు కావని చెప్పడంతో దీనస్థితిలో ఇంటికి వెళ్లాడు. కాగా తనకు వైద్యం కోసం సాయం చేసి ఆదుకోవాలని రెడ్యా దాతల కోసం వేడుకుంటున్నాడు.

Rats destroyed 2 lakh currency notes in mahabubabad