Home తాజా వార్తలు కుంబ్లే సహకారం వల్లే : రవి బిష్ణోయ్

కుంబ్లే సహకారం వల్లే : రవి బిష్ణోయ్

Ravi Bishnoi remembers lessons from anil kumble

 

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే సలహా కారణంగానే తాను మెరుగైన స్పిన్నర్‌గా రాణించగలుతున్నానని యువ సంచలనం రవి బిష్ణోయ్ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో సొంత గడ్డపై జరుగుతున్న వన్డే, టి20 సిరీస్‌కు ఎంపికైన జట్టులో బిష్ణోయ్ చోటు సంపాదించాడు. ఈ సందర్భంగా మీడియా మాట్లాడాడు. ఐపిఎల్‌లో భాగంగా తాను పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడానని, ఆ సమయంలో అనిల్ కుంబ్లే కోచ్‌గా ఉన్నారన్నారు. అప్పుడు ఆయన తనకు పలు సలహాలు, సూచనలు చేశారన్నాడు. దాని పాటించడం వల్లే తన బౌలింగ్ ఎంతో మెరుగైందన్నారు. ఒత్తిడిలో ఎలా బౌలింగ్ చేయాలనే దానిపై కుంబ్లే ఎన్నో చిట్కాలు చెప్పారన్నాడు. తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో కుంబ్లే కీలక పాత్ర పోషించారన్నాడు. తాను టీమిండియాలో చోటు సంపాదించానంటే దానికి ప్రధాన కారణం కుంబ్లే సారే అనడంలో ఎలాంటి సందేహం లేదని బిష్ణోయ్ స్పష్టం చేశాడు.

Ravi Bishnoi remembers lessons from anil kumble