Friday, April 26, 2024

రవిశాస్త్రికి అది పెద్దలోటే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలం పాటు టీమిండియా ప్రధాన కోచ్‌గా కొనసాగిన రవిశాస్త్రికి జట్టుకు ఐసిసి ట్రోఫీ అందించక పోవడం పెద్ద లోటుగానే మిగిలిపోతుందని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రి పర్యవేక్షణలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌లలో అసాధారణ ఆటను కనబరిచిందన్నాడు. అయితే ఐసిసి టోర్నమెంట్‌లకు వచ్చే సరికి ఒక్కసారి కూడా ట్రోఫీని భారత్ సాధించలేదనే విషయాన్ని చోప్రా గుర్తు చేశాడు. రవిశాస్త్రి కోచ్ కెరీర్‌లో ఇదో పెద్ద మచ్చగా మిగిలిపోవడం ఖాయమన్నాడు. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా గడ్డపై భారత్ టెస్టుల్లో చారిత్రక విజయాలు సాధించిందన్నాడు. ఇది అతని కెరీర్‌లోనే అత్యుత్తమ ఘనతల్లో ఒకటిగా చిరకాలం గుర్తుండి పోతుందన్నాడు. కానీ ఐసిసి టోర్నమెంట్‌లలో ట్రోఫీలు సాధించని వెలితి ఎప్పటికీ వెంటాడుతుందని చోప్రా పేర్కొన్నాడు.

Ravi Shastri’s regret would be not to win ICC Trophy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News