Home తాజా వార్తలు రిపబ్లిక్ డే కానుకగా డిస్కో రాజా

రిపబ్లిక్ డే కానుకగా డిస్కో రాజా

Disco-Raja

మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు, రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న ‘డిస్కో రాజా’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్ పార్ట్ ఎక్కువుగా ఉండటంతో ఎక్కడా రాజీపడకుండా క్వాలిటీ అవుట్‌పుట్ కోసమే ఈ చిత్రాన్ని డిసెంబర్ 20 నుంచి జనవరి 24కి వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత రామ్ తాళ్లూరి, దర్శకుడు వి.ఐ.ఆనంద్ తెలిపారు. ఇదిలాఉండగా నవంబర్ 18తో చివరి షెడ్యూల్ షూటింగ్ ముగించి డిసెంబర్ మొదటి వారంలో ‘డిస్కోరాజా’ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, సునీల్, తాన్యాహోప్, బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ః కార్తీక్ ఘట్టమనేని, మ్యూజిక్‌ః తమన్, డైలాగ్స్‌ః అబ్బూరి రవి, ఎడిటర్‌ః నవీన్ నూలి, ఆర్ట్‌ః నాగేంద్ర.

Ravi Teja Disco Raja new release