మాస్ మహరాజ రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన తర్వాతి చిత్రం టచ్ చేసి చూడు పోస్టర్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఈసారి ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. టచ్ చేసి చూడు చిత్రంతో పాటు ఆయన ‘రాజ ది గ్రేట్ అనే మరో చిత్రాన్ని కూడా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ని ఆదివారం విడుదల చేశారు. ‘వెల్కం టు మై వరల్డ్’ అంటూ హీరో చేయి మీద రాసుకొని.. ఆ చేయిని ముఖానికి అడ్డు పెట్టుకొని ఉండడం ఈ పోస్టర్లో కనిపిస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహరీన్ కౌర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 6వ తేది నుంచి ప్రారంభం కానుంది.