Home తాజా వార్తలు జడేజాకు అర్జున అవార్డు!

జడేజాకు అర్జున అవార్డు!

Arjuna Award

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు కోసం నామినేట్ అయ్యాడు. అర్జున అవార్డు కోసం ఎంపిక చేసిన 19 మంది క్రీడాకారుల్లో జడేజా కూడా ఉన్నాడు. క్రికెట్‌కు అందించిన సేవలకు గుర్తింపుగా అతని పేరును భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) సిఫార్సు చేసింది. జడేజాతో పాటు మహ్మద్ షమి, జస్‌ప్రిత్ బుమ్రా, మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ పేరును అర్జున అవార్డు కోసం బిసిసిఐ ప్రతిపాదించింది. కాగా, అవార్డుల సెలెక్షన్ కమిటీ జడేజాతో పాటు, పూనమ్ పేరును అవార్డు కోసం నామినేట్ చేసింది. ఇక జడేజాతో పాటు మరో 18 మందికి ఈసారి అర్జున పురస్కారం దక్కనుంది. స్టార్ అథ్లెట్లు తేజిందర్ పాల్ సింగ్, మహ్మద్ అనస్, స్వప్న బర్మన్, ఫుట్‌బాల్ ఆటగాడు గుర్‌ప్రీత్ సింగ్ సంధు, హాకీ స్టార్ చెంగ్లేసనా సింగ్, షూటర్ అంజుమ్ మౌడ్గిల్ తదితరులకు అర్జున అవార్డులు దక్కనున్నాయి. క్రీడల్లో అసాధారణంగా రాణించే క్రీడాకారులకు ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డులతో సత్కరించడం అనవాయితీగా వస్తోంది. ఇదిలావుండగా స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా, పారా అథ్లెట్ దీపా మాలిక్‌లకు ప్రతిష్టాత్మకమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డులు అందించనున్నారు.

Ravindra Jadeja and 19 sportspersons nominated for Arjuna Award