Home తాజా వార్తలు రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు

రవీంద్ర జడేజాకు అర్జున అవార్డు

 

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు అరుదైన గౌరవం దక్కింది. 30 ఏళ్ల జడేజాను ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ఎంపిక అయ్యాడు. శనివారం జస్టిస్‌ (రిటైర్డ్‌) ముకుందకమ్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ, జడేజాతోపాటు మొత్తం 19 మంది అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. ఉమెన్స్ క్రికెటర్, లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ కూడా ఈ అవార్డుకు ఎంపికైంది. 2018లో ఈ అవార్డును ఓపెనర్, ఉమెన్స్ క్రికెటర్ స్మృతి మంథాన అందుకున్నారు. ఇక, పారా అథ్లెట్ దీపా మాలిక్, రెజ్లర్ బజ్‌రంగ్‌ పునియాలు రాజీవ్ గాంధీ ఖేల్ రత్నా 2019 అవార్డుకు ఎంపికయ్యారు.

బిసిిసిఐ.. మహ్మద్ షమీ, జస్ర్పీత్ బుమ్రా, రవీంద్ర జాడేజా, పూనమ్ యాదవ్ ల పేర్లను అవార్డు సెలక్షన్ కమిటీకి సిఫార్స్ చేసింది. కాగా, ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్ లో రవీంద్ర జడేజా తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తన ఫీల్డింగ్ తోపాటు న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సెమీ ఫైనల్లో అద్భుత బ్యాటింగ్ తో 59 బంతుల్లోనే 77 పరుగులు చేసి టీమిండియాను గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ చివర్లో జడేజా భారీ షాట్ కు ప్రయత్నించి ఔటవ్వడంతో భారత్ పరాజయం పాలయ్యిన సంగతి తెలిసిందే. భారత్‌ తరఫున జడేజా 156 వన్డేలు, 41 టెస్టులు, 42 టీ20లు ఆడాడు.

Ravindra Jadeja nominated for the Arjuna Award 2019