Home వార్తలు ‘పందెం కోడి’కి మించిన మూవీ ‘రాయుడు’

‘పందెం కోడి’కి మించిన మూవీ ‘రాయుడు’

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘రాయుడు’. ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈనెల 27న ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా విశాల్‌తో ఇంటర్వూ విశేషాలు…

vishalనా లుక్ మాస్‌గా…
‘రాయుడు’ అనేది ఒక రూరల్ సినిమా. బామ్మకి, మనవడికి మధ్య జరిగే కథ ఇది. ఈ సినిమాకు హీరో,హీరోయిన్ ఇద్దరూ బామ్మే. నేను ఈ సినిమాలో బస్తాలు మోసే క్యారెక్టర్ చేశాను. పందెం కోడి, వాడు వీడు సినిమాల తర్వాత పూర్తిస్థాయి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నటించిన సినిమా ఇది. నా లుక్ కూడా చాలా మాస్‌గా ఉంటుంది. గడ్డం, టాటూతో కనిపిస్తాను. మధురైలోని రాజపాళ్యం అనే ప్రాంతంలో ఈ సినిమాను చిత్రీకరించాం. ముత్తయ్య మంచి మాస్ డైరెక్టర్. ప్రేక్షకులు నన్ను ఇష్టపడే విధంగా ఈ సినిమాను రూపొందించారు.
హైలైట్‌గా క్లైమాక్స్…
ఈ సినిమా క్లైమాక్స్ అందరికీ నచ్చుతుంది. సినిమాలో అదే హైలైట్. నేను ఎక్కడికి వెళ్లినా… పందెంకోడి వంటి సినిమా కావాలని అడుగుతున్నారు. దాన్ని మించి ఈ సినిమా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే పూర్తి వినోదాత్మక సినిమా ఇది.
ఎప్పుడు విన్నా ఫ్రెష్‌గా…
ఇది వరకు కూడా నేను ఇమాన్‌తో కలిసి పనిచేశాను. ఆయన సంగీతం వినేకొద్దీ బావుంటుంది. ఐదేళ్ల తర్వాత విన్నా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇళయరాజా సార్ సంగీతంలో ఆ గుణం ఉంటుంది. ఇప్పుడు నాకు ఇమాన్‌లో ఆ గుణం కనిపిస్తోంది.
సహజంగా ఫైట్స్…
ఈ సినిమాలో ఫైట్స్ చాలా స్పెషల్‌గా ఉంటాయి. కండలు తిరిగిన ఒక వ్యక్తి పదిమందిని కొడితే ఎంత సహజంగా ఉండాలో, అంత సహజంగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం కాస్త బరువు పెరిగాను. అనల్ అరసు నాతో ఫైట్స్ చేయించడాన్ని ఎంజాయ్ చేస్తారు.
తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తా…
నాతో తెలుగులో సినిమా చేయాలని ఒక డైరెక్టర్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. సమయం చూసుకొని ఆయనతో సినిమా చేస్తా. తొందరలోనే అది నెరవేరుతుందని ఆశిస్తున్నాను.
అందుకే ‘టెంపర్’ రీమేక్ చేస్తున్నా…
‘టెంపర్’ సినిమాలో ఒక సందేశం ఉంటుంది. అందుకే తమిళ ప్రేక్షకులకు కూడా ఆ కథను చెప్పాలని భావిస్తున్నాను. ఒక మంచి సందేశాన్ని కమర్షియల్ చిత్రాలకు జోడిస్తే అదరికీ అంది రీచ్ అవుతుంది.
నెక్స్ సినిమాలు…
శిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాను. అక్టోబర్ 7న ఆ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. జూలై నుండి మిష్కిన్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ మొదలవుతుంది. ఆతర్వాత టెంపర్ సినిమా రీమేక్ చేస్తాను. అలాగే బాలాతోనూ ఓ సినిమా చేయాలనుకుంటున్నాను.