Friday, March 29, 2024

రూ.50వేల కోట్ల ప్యాకేజీ

- Advertisement -
- Advertisement -

RBI

 

రెండు వారాలు పథకం అమల్లో ఉంటుంది
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతం వల్ల ఈ నిర్ణయం

న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు రూ.50 వేల కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ విండోను ప్రారంభించనున్నట్టు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా క్యాపిటల్ మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండడం వల్ల మ్యూచువల్ ఫండ్స్ ద్రవ్యకొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. అమెరికాకు చెందిన మ్యూచువల్ ఫండ్ హౌస్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భారతదేశంలో 6 డెట్ ఫండ్లను మూసివేసింది. డెబిట్ ఎంఎఫ్‌ల క్లోజింగ్‌కు సంబంధించిన ఒత్తిడి కారణంగా లిక్విడిటీ సమస్య భయం ప్రజలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలో ద్రవ్య సంక్షోభం తలెత్తకుండా ఉండటానికి ఆర్‌బిఐ సోమవారం మ్యూచువల్ ఫండ్ల కోసం రుణ పథకాన్ని ప్రకటించింది.

మే 11 లోగా నిధులు ఉపయోగించాలి
మ్యూచువల్ ఫండ్ల కోసం ఆర్‌బిఐ లిక్విడిటీ సౌకర్యం 2020 ఏప్రిల్ 27 నుండి మే 11 వరకు లేదా పూర్తి మొత్తాన్ని ఉపయోగించే వరకు అమలులో ఉంటుంది. సమయాన్ని ఆర్‌బిఐ పరిశీలించనుండగా, మార్కెట్ పరిస్థితులపై నగదు ఆధారపడి ఉంటుంది. కోవిడ్-19 కారణంగా క్యాపిటల్ మార్కెట్లలో అస్థిరత పెరిగిందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. కరోనా మహామ్మారి వల్ల మ్యూచువల్ ఫండ్లపై లిక్విడిటీ ఒత్తిడి నెలకొంది. ఈ ఒత్తిడిని తగ్గించడానికి రూ .50 వేల కోట్ల నిధిని మ్యూచువల్ ఫండ్‌కు ప్రత్యేక లిక్విడిటీని అందించాలని ఆర్‌బిఐ నిర్ణయించింది.

ఆరు ఫండ్ల మూసివేత
గత వారం దేశీయ ఎనిమిదో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కరోనా సంక్షోభం కారణంగా ఆరు ఫండ్స్‌ను మూసివేసింది. 2020 ఏప్రిల్ 23 నుండి అమలులోకి వచ్చే ఆరు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ స్కీమ్‌లను స్వచ్ఛందంగా ముగించాలని నిర్ణయించింది. కరోనా వైరస్ సంక్షోభం ప్రభావం,, కార్పొరేట్ బాండ్ల మార్కెట్లో పెరిగిన ఉపసంహరణ ఒత్తిడి, క్షీణించిన ద్రవ్యత లభ్యత వల్ల ఈ నిర్ణయం తప్పలేదని సంస్థ తెలిపింది. మూసివేసిన ఆరు ఫండ్స్త్.. ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యురేషన్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రూవల్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్‌టర్మ్ ఇన్‌కం ప్లాన్, ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్‌కం అపార్చునిటీస్ ఫండ్ ఉన్నాయి. కాగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మ్యూచువల్ ఫండ్ల కోసం వాల్యుయేషన్ పాలసీలను సడలించింది. కరోనావైరస్ సంక్షోభం కారణంగా ఆయా సంస్థలు మెచ్యూరిటీలో పొడిగింపు, లేదా వడ్డీ చెల్లించడంలో ఆలస్యం అయితే వాటిని డిఫాల్టర్స్‌గా ప్రకటించ వద్దని తెలిపింది.

ఈ ఫండ్స్ ఎందుకు మూసివేసింది?
ఈ రుణ నిధులు తక్కువ- రేటెడ్ బాండ్లలో పెట్టుబడి పెట్టాయి. ఇక్కడ ద్రవ్యత ప్రధాన సమస్యగా ఉంది. అధిక రిడెమ్షన్ కారణంగా ఫండ్ బాండ్లను చాలా తక్కువ ధరకు విక్రయించింది. దీనివల్ల ఫండ్ పోర్ట్‌ఫోలియో విలువ పడిపోయింది. ఫండ్ హౌస్ చెల్లించే వరకు పెట్టుబడిదారుల పెట్టుబడి లాక్ అవుతుంది. పెట్టుబడిదారులు తమ డబ్బును తిరిగి పొందుతారు కాని ఇప్పుడు కొంత సమయం పడుతుంది.

 

RBI announces Loan scheme for Mutual funds
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News