Friday, March 29, 2024

1 నుంచి ఆర్‌బిఐ కార్డ్ టోకెనైజేషన్ కొత్త నిబంధనలు

- Advertisement -
- Advertisement -

RBI Card Tokenisation New Rules from October 1

ముంబయి : డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుల దుర్వినియోగానికి సంబంధించి కార్డుదారుల నుంచి తరుచుగా ఫిర్యాదులు రావడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఆర్‌బిఐ తన ఆన్ టోకెనైజేషన్ నిబంధనలను అక్టోబర్ 1నుంచి అమలులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. భవిష్యత్ చెల్లింపుల కోసం వ్యాపారుల వెబ్‌సైట్‌లో తమ కార్డు డేటాను స్టోర్ చేసిన కారణంగా జరిగిన సైబర్ మోసాల ద్వారా గత కొన్నేళ్లుగా చాలామంది మోసపోయారు. ఈ టోకెన్ లావాదేవీల కోసం వ్యాపారి వెబ్‌సైట్ ద్వారా ఉపయోగించేవారు. ప్రస్తుతం బ్యాంకు కార్డు వివరాలు లావాదేవీల కోసం వ్యాపారి వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఒకవేళ సదరు వ్యాపారి వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు చేస్తే వినియోగదారుల వివరాలు బహిర్గతం అవుతున్నాయి. ఈనేపథ్యంలో కస్టమర్లు, కార్డు వివరాలు భద్రత కోసం ఆర్‌బిఐ టొకనైజేషన్‌లో కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత వినియోగదారుల సమాచారం వ్యాపారి వెబ్‌సైట్‌లో కాకుండా బ్యాంక్ వద్ద ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News